త్రివిక్రమ్ డిజాస్టర్ సినిమాపై మహేష్ కామెంట్.. గుడ్ న్యూస్ చెప్పేశాడు

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ తో పాటు మరచిపోలేని కొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ప్లాప్ అయిన సినిమాలు కూడా మహేష్ కి మరో విధంగా ఉపయోగపడ్డాయి. అందులో ఖలేజా సినిమా ఒకటి. నిజానికి ఆ సినిమాలో మహేష్ కామెడీ సరికొత్తగా ఉంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా వచ్చి పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా మహేష్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పేశాడు.

 ఖలేజాపై అంచనాలు పెరగడానికి కారణం

ఖలేజాపై అంచనాలు పెరగడానికి కారణం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా తరువాత ఎవరు ఉహీంచని విధంగా తెరకెక్కించిన సినిమా అతడు. అందులో మహేష్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందరికి తెలిసిందే. సీరియస్ లుక్ లోనే మహేష్ ని విభిన్న కోణాల్లో చూపించాడు త్రివిక్రమ్. ఇక ఆ తరువాత వారి కలయికలో వచ్చిన ఖలేజా సినిమాపై అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం అతడు. అలాగే త్రివిక్రమ్ అంతకుముందు జల్సాతో హిట్ కొట్టడం మరొక కారణమని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ పై మహేష్ కామెంట్

త్రివిక్రమ్ పై మహేష్ కామెంట్

ఇక 10ఏళ్ళయిన సందర్భంగా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేష్ ఈ విధంగా స్పందించాడు. నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించిన చిత్రం. ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుంది. నాకు మంచి స్నేహితుడు అద్భుతమైన త్రివిక్రమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నాము. అతి త్వరలో.. అంటూ మహేష్ వివరణ ఇచ్చారు.

Recommended Video

Trivikram Srinivas,Suman Emotional Words On S. P. Balasubrahmanyam
మూడవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా..?

మూడవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా..?

మహేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే ఈ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే చాలా సార్లు ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక చాలా రోజుల తరువాత మహేష్ త్రివిక్రమ్ గురించి కామెంట్ చేయడంతో ఎదో జరుగుతోంది అనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నాడు. మరి వీరి కాంబినేషన్ లో మూడవ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X