మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి.. పెద్ద మాయగాడు!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లెజెండరీ నటుడు కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలో తన పేరిట ప్రత్యేక రికార్డులను నెలకొల్పారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ( SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి లో నటిస్తున్నారు. ఈ మూవీతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్‌గా మరో స్థాయి గుర్తింపు పొందనున్నారు. దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే 'వారణాసి' మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్, మహేష్ బాబు 'రుద్ర' లుక్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రివీల్ తర్వాత 'వారణాసి'పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో విలన్‌గా సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇలా ప్రతి చిన్న అప్డేట్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మహేష్ బాబు గురించి ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేసిన పాత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ దర్శకుడు మరెవరో కాదు... గుణశేఖర్. మహేష్ బాబుతో వరుసగా మూడు సినిమాలు చేసిన అరుదైన దర్శకుడిగా గుణశేఖర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గుణశేఖర్ -మహేష్ బాబు కాంబినేషన్‌లో 'ఒక్కడు', 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. వీటిలో 'ఒక్కడు' తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక అర్జున్ మూవీ యావరేజ్‌గా నిలవగా, సైనికుడు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడక ఫ్లాప్‌గా నిలిచింది.
ఇదిలాఉంటే.. ఇటీవల డైరెక్టర్ గుణశేఖర్ కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ తెగ వైరలవుతుంది. ఇందులో డైరెక్టర్ గుణశేఖర్, మహేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. "మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక్కసారి ఆయనతో సినిమా చేశామంటే చాలు... ఆయనకు అడిక్ట్ అయిపోతాం. మళ్లీ మళ్లీ ఆయనతోనే సినిమా చేయాలనిపిస్తుంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాను వరుసగా మూడు సినిమాలు మహేష్‌తో చేశానని, అదే తన చేసిన అతిపెద్ద తప్పు అని కూడా అన్నారు.
'ఈ తరం హీరోల్లో ఒకే డైరెక్టర్‌తో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరోని ఎక్కడైనా చూశారా? నేను కూడా మహేష్‌తో తీస్తే సరిపోదు, వేరే హీరోలతో కూడా సినిమాలు చేయాల్సింది. అందుకే ఇప్పుడు అంత గ్యాప్ వచ్చింది' అంటూ గుణశేఖర్ తన మనసులో మాటను బయటపెట్టారు. అంతేకాదు, మహేష్ బాబు దర్శకులకు తన నటనతో ఎప్పుడూ సవాల్ విసురుతారని, ఒక డైరెక్టర్ 100 శాతం ఇవ్వమంటే... మహేష్ 200 శాతం ఇచ్చే నటుడని ప్రశంసించారు.
మహేష్ బాబు మత్తులాంటి వ్యక్తి అని, ఆయనతో పని చేస్తే ఆయన మాయలో పడిపోతామని గుణశేఖర్ చెప్పడం ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. అప్పట్లో వరుసగా కాకుండా మధ్యలో వేరే హీరోలతో సినిమాలు చేసి ఉంటే, ఆ మూడు సినిమాల ఫలితాలు వేరేలా ఉండేవని కూడా గుణశేఖర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, గుణశేఖర్ చేసిన కామెంట్స్ వెలుగులోకి రావడంతో మహేష్ బాబు డెడికేషన్, కమిట్‌మెంట్, ఎనర్జీ గురించి తన ఫ్యాన్స్ ప్రశంసలు కురుపిస్తున్నారు. 'ఇదే మా సూపర్ స్టార్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మహేష్ బాబు కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు... దర్శకులను కూడా తన నటనతో మంత్రముగ్ధులను చేసే మాయగాడు అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











