సర్కారు వారి పాట రెండో షెడ్యూల్.. రంగంలోకి మహేష్ బాబు
మైత్రీ మూవీస్ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్వకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. గతేడాది వదిలిన మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో వర్కవుట్ అయింది. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా సర్కారు వారి పాట సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఇక మొన్నటి వరకు దుబాయ్‌లో జరిపిన షూటింగ్ కూడా బాగానే వచ్చిందని టాక్.
దుబాయ్‌లో నెల రోజుల పాటు అదిరిపోయే యాక్షన్ అండ్ రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించినట్టు టాక్. అయితే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన చిత్రయూనిట్.. ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. ఉగాది సందర్భంగా చిత్రయూనిట్ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించేసింది. అయితే ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఓ ప్రకటనను చేసింది. అందిరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ అప్డేట్ ఇచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట రెండో షెడ్యూల్‌లో అడుగపెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ప్రారంభించామని క్లారిటీగా చెప్పారు. కీర్తి సురేష్ ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయింది. దుబాయ్ షెడ్యూల్‌లో మహేష్ బాబుతో కీర్తి సురేష్ రచ్చ చేసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రంగంలోకి దిగడానికి రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











