‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ విషయంలో మహేశ్ బాబు కీలక నిర్ణయం
'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం దీన్ని రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ గత జనవరిలోనే ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే దుబాయ్‌లో ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. రెండో షెడ్యూల్ కోసం పలు రకాలుగా ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ మధ్యనే హైదరాబాద్‌లో దాన్ని మొదలు పెట్టారు. ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో నిలిపి వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ కూడా క్యాన్సిల్ అయింది. నగర శివారులోని శంకరపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్‌తో చిత్రీకరణ జరుపుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. కరోనా నేపథ్యంలో చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణ జరుపుతూ వచ్చారు. కానీ, పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఏర్పడడంతో దాన్ని కాస్తా ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ పలానా రోజు నుంచే పున: ప్రారంభం అవుతుందని కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకూ ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టకూడదని మహేశ్ బాబు నిర్ణయించుకున్నాడట. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలకు కూడా తేల్చి చెప్పాడని తెలిసింది. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











