యూట్యూబ్‌ను మడతపెట్టేసిన గుంటూరుకారం పాట.. ట్రెండింగ్‌లో కుర్చీ మడతపెట్టి సాంగ్! ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. సినిమాతో పాటు అందులోని పాటలు, డైలాగ్లు అయితే మరింత అదిరిపోయాయి. ముఖ్యంగా మాస్ సాంగ్... కుర్చిమడతపెట్టి పాట అయితే యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ తో ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం సినిమా సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా కుర్చి మడత పెట్టి పాట అయితే మరింత అదిరిపోయింది. లిరిక్స్ లో ఎలాంటి బూతు పదాలు లేకుండా పాటను చాలా బాగా రాశారు. ముఖ్యంగా ఈ పాటకు మహేష్ బాబుతో పాటు హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్పులు అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు సూపర్ స్టార్ ఇలాంటి స్టెప్పులు వేయలేదు.

మళ్లీ జీవితంలో ఇలాంటి లోకల్ సినిమాల్లో స్టెప్పులు వేసే అవకాశం వస్తుందో రాదోనని డ్యాన్స్ ఇరగదీయాలని ఫిక్స్ అయినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముందుగా విడుదల అయిన కుర్చి మడతపెట్టి పాట లిరికల్ సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ ను సాధించి సెస్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే కాదు... పూర్తి వీడియో సాంగ్ కూడా ట్రెండ్ సెట్ చేసింది.
కుర్చిమడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ ను 13 రోజుల క్రితమే విడుదల చేయగా... ఎవరూ ఊహించని స్థాయిలో వ్యూస్ ను రాబట్టుకుంది. ఇప్పటి వరకు 44 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని రచ్చ చేస్తోంది. అలాగే ఈ పాటకు అనేక మంది స్టెప్పులు వేశారు. ఇన్ స్టాగ్రామ్ వేధికగానే మొత్తం 1.5 మిలియన్ల ఫాలోవర్లు... తమదైన స్టైల్ లో ఈ సాంగ్ కు స్టెప్పులు వేశారు. బిగ్గెస్ట్ చాట్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ పాటే ప్రస్తుతం అందరి ఫేవరెట్.

ఇదంతా ఇలా ఉండగా.. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరిల కాంబోలో వచ్చిన ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ చేశారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 201.89 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











