నమ్రత విషయంలో నేను ఇన్వాల్వ్ కాను.. ఆమె చాలా స్ట్రిక్ట్.. మహేష్ బాబు

Recommended Video

Mahesh Babu About His Wife And Kids In A Recent Interview || Filmibeat Telugu

టాలీవుడ్ హీరోలోకెల్లా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ జర్నీ ఎంతో డిఫరెంట్. చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్.. రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఏ మాత్రం వెనుదిరిగి చూడకుండా తండ్రికి తగ్గ వారసుడిగా ఎదిగి సూపర్ స్టార్ బిరుదు సొంతం చేసుకున్నారు. మహేష్ నటించిన సినిమాలను బాలీవుడ్ లోని స్టార్ హీరోలతో హిందీలో రీమేక్ చేసి హిట్స్ అందుకుంటున్నారు ఉత్తరాది దర్శకనిర్మాతలు. ఇప్పటి వరకు మహేష్ జర్నీలో 25 సిన్మాలు పూర్తయ్యాయి. 26 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సందర్బంగా తాజాగా ఓ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

నాలుగేళ్ళ వయసులోనే మీ సినీ జర్నీ స్టార్ట్ అయింది.. మీ ఫీలింగ్స్ ఏంటి?

నాలుగేళ్ళ వయసులోనే మీ సినీ జర్నీ స్టార్ట్ అయింది.. మీ ఫీలింగ్స్ ఏంటి?

దీనిపై స్పందిస్తూ నా సినిమా జర్నీ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఎంతో సంతృప్తికరంగా, వినయ పూర్వకంగా ఈ జర్నీ సాగింది. మా నాన్న గారి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ నన్ను నా వెన్నంటి ప్రోత్సహిస్తూ ఈ జర్నీలో భాగమవుతున్నారు. మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే నా ప్రధాన లక్ష్యం అని మహేష్ అన్నారు.

మొదటి సినిమా చేసి 20 ఏళ్లయింది.. ఇంకా 25 సినిమాలే.. దీనిపై మీ స్పందన

మొదటి సినిమా చేసి 20 ఏళ్లయింది.. ఇంకా 25 సినిమాలే.. దీనిపై మీ స్పందన

నాకైతే సినిమాలు తొందర తొందరగా చేయాలనే ఆలోచనలు లేవు. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ నా అభిమానులకు, ప్రేక్షకులకు వినోదం పంచడమే ధ్యేయంగా సినిమాలు చేస్తూ వస్తున్నా. ఇలా కౌంటింగ్ గురించి నేను పట్టించుకోను అని మహేష్ రియాక్ట్ అయ్యాడు.

 డైరెక్టర్ ఛాయిస్‌కే ప్రాధాన్యత ఇస్తా

డైరెక్టర్ ఛాయిస్‌కే ప్రాధాన్యత ఇస్తా

నేను కేవలం నటున్ని మాత్రమే. నా సినిమాల్లో డైరెక్టర్ కి సూచనలు ఇవ్వడం లాంటివి చేయను. పూర్తిగా డైరెక్టర్ ఛాయిస్ లోనే సెట్స్ పై కదులుతుంటా. ఎందుకంటే ఓ డైరెక్టర్ తన స్క్రిప్ట్ ఎంతో బలంగా తయారు చేసుకుంటాడని నాకు తెలుసు.. అని మహేష్ బాబు అన్నాడు.

నమ్రతేనే నా ప్రధాన బలం

నమ్రతేనే నా ప్రధాన బలం

నా సినిమాల విశ్లేషణ పరంగా, నా సొంత క్రిటిక్ గా నమ్రత సూచనలు నాకు మరింత బలాన్నిస్తాయి. ఆమెనే నా ప్రధాన బలం. నేను స్ట్రెస్ గా ఫీల్ అయినపుడు నన్ను కూల్ చేయడంలో నమ్రత, నా పిల్లలు ఎప్పుడూ ముందుంటారు అని మహేష్ పేర్కొన్నాడు.

సితార, గౌతమ్ ఇష్టపడే సినిమాలు

సితార, గౌతమ్ ఇష్టపడే సినిమాలు

తన సినిమాలన్నీ కూతురు సితార, కొడుకు గౌతమ్ రెగ్యులర్ గా చేస్తుంటారని మహేష్ అన్నాడు. తన సినిమాల్లో సితారకు శ్రీమంతుడు ఇష్టమని, అలాగే గౌతమ్ కి అతడు సినిమా ఇష్టమని మహేష్ చెప్పుకొచ్చాడు.

నమ్రత విషయంలో ఇన్వాల్వ్ కాను

నమ్రత విషయంలో ఇన్వాల్వ్ కాను

నమ్రత అన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. అందుకే ఆమె ప్రొడక్షన్ విషయంలో నా ఇన్వాల్వ్ మెంట్ అసలే ఉండదు. బిజినెస్ పరంగా నమ్రత భేష్ అని నా అభిప్రాయం అని మహేష్ పేర్కొన్నాడు.

నేను కాదు నమ్రతానే స్ట్రిక్ట్

నేను కాదు నమ్రతానే స్ట్రిక్ట్

పిల్లల విషయంలో మీ ఇద్దరిలో ఎవరు స్ట్రిక్ట్ అనే దానిపై స్పందించిన మహేష్.. తాను పిల్లలను చాలా గారాబం చేస్తుంటానని, నమ్రతనే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని అన్నాడు. పిల్లల పెంపకంలో కూడా నమ్రతను అభినందించాల్సిందే అని ఈ సందర్బంగా మహేష్ పేర్కొన్నాడు.

సరిలేరు నీకెవ్వరు

సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు 26 వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X