ఆసక్తిని కలిగిస్తున్న 'మేజర్' ఫస్ట్ గ్లింప్స్.. హై వోల్టేజ్ లుక్కుతో అడివి శేష్!
టాలెంటెడ్ యువ హీరో అడివి శేష్ చాలా రోజుల తరువాత మరో విభిన్నమైన సినిమాతో రాబోతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న అడివి శేష్ ఈ సారి ఒక రియల్ హీరో కథతో రాబోతున్నాడు. మేజర్ అనే కొత్త సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ గ్లింప్స్ ను నేడు మహేష్ బాబు విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ సొంత బ్యానర్ బీఎంజీ ఎంటర్టైన్మెంట్స్ అలాగే సోనీ పిక్చర్స్ శరత్ చంద్ర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2006 ముంబై టెర్రరిస్టుల ఉగ్రదాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణించిన విషయం తెలిసిందే. ఆ రియల్ హీరో జీవిత ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

ఇక నేడు మేజర్ అన్ని కృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అగ్ని మంటల్లో అడివి శేష్ హై వోల్టేజ్ లుక్కుతో కనిపిస్తున్నాడు. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తోంది. ఇక సినిమా టీజర్ ను మార్చ్ 28న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను గూఢచారి దర్శకుడు శశికిరణ్ తెరకెక్కిస్తున్నాడు. శోభిత ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జూలై 2న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











