మహేష్ బాబు కేక.. సితారతో మిర్రర్ సెల్పీ.. వైరల్‌గా
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను మహేష్ బాబు సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. పూర్తిస్థాయిలో కుటుంబంతో ఉంటూ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. కూతురు సితార, కొడుకుతో కలిసి చిన్న పిల్లాడిలా మారిపోయి ఫన్ గేమ్స్‌తో కేక పెట్టిస్తున్నారు. తాజాగా కూతురుతో దిగిన సెల్ఫీ వైరల్‌గా మారింది.
గత రెండు నెలలకుపైగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న మహేష్ బాబు పలు రకాల సెల్ఫీలు, ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌లో షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొంటున్నారు. తాజాగా మహేష్ తన కూతురితో మిర్రర్ సెల్ఫీని తీసి ఆకట్టుకొన్నారు.

అద్దంలో చూసుకొంటూ మిర్రర్ సెల్పీ తీస్తూ మహేష్ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగా సితార మాత్రం నవ్వుతూ ఫోజిచ్చింది. సెల్ఫీలు తీయడంలో తన తండ్రి ప్రతిభ గురించి సితార వెల్లడిస్తూ.. మిర్రర్ సెల్ఫీలు తీయడంలో నాన్న మాస్టర్ అంటూ కితాబు ఇచ్చింది.
ఈ సందర్భంగా మహేష్ ఆ ఫోటోను షేర్ చేస్తూ మా రిఫ్లెక్షన్స్‌ను చూసుకొంటున్నాం. సితార ఘట్టమనేనితో మిర్రర్ సెల్పీ తీయడంలో మాస్టర్ అయ్యాను అంటూ ఓ కామెంట్ పోస్టు చేశారు. రెండు హార్ట్ ఇమోజీలను కూడా పోస్టుతోపాటు పెట్టారు.
సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని గీతా గోవిందం ఫేమ్ దర్శకుడు పరుశురాంతో చేస్తున్నారు. ఈ చిత్రం లాక్‌డౌన్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











