Mahesh Babu : వాహ్ ఏమ్మున్నాడురా బాబు.. కిల్లర్ లుక్ లో రెక్ లెస్ గా!
గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం మరో హిట్ అందుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అటు అభిమానులనే కాక సినీ ప్రేక్షకులను కూడా సినిమా అలరించింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో సినిమా చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ కాగా గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అందుకొని ఖాళీగా ఉన్న పరశురామ్ తో సినిమా అనౌన్స్ చేశాడు. సర్కారు వారి పాట పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని మహేష్ బాబుని చూపిస్తామని ముందు నుంచి సినిమా యూనిట్ ప్రచారం చేస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబుకు సంబంధించిన రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మహేష్ బాబు కు సంబంధించిన ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బ్లాక్ షర్ట్ లో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్న మహేష్ బాబు చాలా రెక్ లెస్ గా రెండు చేతులు వెనుక ఉన్న ఒక ఒక రాడ్ మీద పెట్టి కిల్లర్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫోటోలో మహేష్ బాబును చూసి కళ్ళు తిప్పుకోవడం కష్టమనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపుగా అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.. రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ పేరుతో ఒక వీడియోని విడుదల చేయడానికి ఈ సినిమా యూనిట్ సిద్ధమైంది.

ఈ బ్లాస్టర్ మీద అటు సినిమా యూనిట్ కూడా అనేక అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ మాత్రం ట్విట్టర్ వేదికగా అనేక అద్భుతాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు రేపు మహేష్ 46 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా టాలీవుడ్ కి చెందిన టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు సుమారు 20 మంది ఈ రాత్రి ఏడు గంటల రెండు నిమిషాలకు షెడ్యూల్ చేయబడిన ఒక ట్విట్టర్ స్పేస్ లో పాల్గొని మహేష్ బాబు గురించి తమ అనుభవాలను తమ అభిప్రాయాలను పంచుకో పోతున్నారని తెలుస్తోంది. ఒక రకంగా టాలీవుడ్ ట్విట్టర్ కి సంబంధించి ఇది అతిపెద్ద స్పేస్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ లుక్ విడుదల కావడంతో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఒక రోజు ముందుగానే మొదలైపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా నమ్రత కూడా షేర్ చేశారు..


Click it and Unblock the Notifications











