For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata first notice: అట్ల్రా స్టైలిష్ లుక్ లో మహేష్, ఆ ముగ్గురు స్టార్స్ తో పోటీ!

  |

  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా మూవీ "సర్కార్ వారి పాట". ఈ సినిమా గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

  సరిలేరు నీకెవ్వరు

  సరిలేరు నీకెవ్వరు

  గత ఏడాది సంక్రాంతికి "సరిలేరు నీకెవ్వరు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటించారు రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించి ఈ సినిమాని విజయవంతం కావడంతో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది.

  కరోనా ఎఫెక్ట్

  కరోనా ఎఫెక్ట్


  ఈ మేరకు మహేష్ కూడా ప్రకటన చేశారు. కానీ ఏమైందో ఏమో కానీ అప్పటికే 'గీతగోవిందం' సినిమా తీసి చాలా గ్యాప్ తీసుకుని దర్శకుడు పరశురామ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో పూర్తి చేసుకుని వచ్చారు. రెండో షెడ్యూల్ పూర్తి చేసి వీలైనంత త్వరలో రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్ కు కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండో షెడ్యూల్ షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

  హైదరాబాద్ లో షూటింగ్

  హైదరాబాద్ లో షూటింగ్

  ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని సీన్స్ ను హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి కొన్ని సీన్స్ లీక్ అయి సినిమా మీద ఆసక్తిని మరింత పెంచాయి అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యూనిట్ మీద కూడా మహేష్ బాబు ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపించాయి. సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మహేష్ బాబు సూచనలు చేయడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.

  ఫస్ట్ నోటీస్

  ఫస్ట్ నోటీస్

  అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా రోజులుగా సరైన అప్ డేట్స్ లేవని ఫ్యాన్స్ గోల చేస్తూ ఉండడంతో రంగంలోకి దిగిన మహేష్ బాబు పిఆర్ టీం ఈ సినిమా నుంచి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఉండేలాగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మహేష్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు ఒక రెడ్ కలర్ కార్ లో కూర్చుని చూస్తూ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ముందు నుంచి ఈ సినిమాలో ఆయన మెడ మీద కనిపించిన టాటూ ఈ పోస్టర్ లో కూడా కనిపిస్తోంది. కారు అద్దం పగిలి పోయి ఉండడంతో ఇది ఒక ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన స్టిల్ అని భావిస్తున్నారు.

  రిలీజ్ డేట్ కూడా

  రిలీజ్ డేట్ కూడా

  మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రకటించారు. ముందు నుంచి సంక్రాంతికి వస్తున్నామని చెబుతూ వస్తున్న ఈ సినిమా యూనిట్ సంక్రాంతి సందర్భంగా 13 వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే ఇప్పటికే సంక్రాంతికి దాదాపు మరో మూడు సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్" సినిమా, పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వస్తున్న మలయాళం రీమేక్, సినిమా అలాగే అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ కాంబినేషన్ లో వస్తున్న "ఎఫ్3" సినిమా సంక్రాంతికి రాబోతున్నాయి.

  బరిలో ముందుగా

  బరిలో ముందుగా


  వీటన్నింటిలో కూడా ప్రస్తుతానికైతే ప్రభాస్ "రాధేశ్యామ్" సినిమా ఒక్కటే రిలీజ్ డేట్ ప్రకటించింది. ప్రభాస్ "రాధేశ్యామ్" సినిమా 14వ తేదీన రిలీజ్ చెబుతున్నట్లుగా ప్రకటించగా... దానికి ఒక్క రోజు ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నట్టుగా ప్రకటించారు. మొత్తం మీద ఈ ఏడాది సంక్రాంతి మాత్రం హోరాహోరీగా ఉండబోతుందని తేల్చేశారు. దాదాపుగా నాలుగు సినిమాలు ఇప్పటికే ప్రకటనలు జారీ చేయగా, మరే సినిమా కూడా ఈ రేసులో నిలబడడానికి సాహసం చేయకపోవచ్చును అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నాయి. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

  28 నిముషాల్లో రికార్డు బద్దలు

  28 నిముషాల్లో రికార్డు బద్దలు

  ఇక మరో పక్క ఈ సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ నోటీస్ రిలీజ్ చేయడంతో ఆ వెంటనే సోషల్ మీడియాలో అది వైరల్ అయిపొయింది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ నోటీస్ రికార్డు బద్దలు కొట్టింది. టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన 24 గంటల్లో అత్యధిక రీట్వీట్ లు చేసిన ట్వీట్ గా రికార్డులకు ఎక్కింది. కేవలం 28 నిముషాల్లో ఈ ట్వీట్ కి ఏకంగా 30.1K రీట్వీట్స్ రావడం ఆసక్తికరంగా మారింది.

  English summary
  Sarkaru Vaari Paata, a Parasuram Petla directorial, will see Mahesh Babu as lead role. makers of the film posted a treat for Mahesh Babu fans. team of Sarkaru Vaari Paata shared the actor’s first look from the film, which they tagged as “Sarkaru Vaari Paata First Notice.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X