SIIMA Nominations 2019: 10 అవార్డులుకు టార్గెట్ సెట్ చేసుకున్న మహేష్ మూవీ.. పోటీగా మరో చిన్న మూవీ

చాలా కాలం తర్వాత మళ్ళీ అవార్డులకు సంబంధించిన ఈవెంట్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఇండస్ట్రీలో అత్యధిక ఆదరణ పొందిన సైమా అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ జరుగుతున్నాయి అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంటుంది. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరు కూడా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా సైమా కోసం ఏ మాత్రం మిస్ అవకుండా పాల్గొంటూ ఉంటారు. గత ఏడాది జరగాల్సిన సైమా అవార్డుల మహోత్సవం మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. 2019 సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రదానోత్సవం చేయబోతున్నారు. అందులో మహేష్ బాబు సినిమానే ఏకంగా పది రకాల విభాగాల్లో నామినేషన్స్ కు సెలెక్ట్ అవ్వడం విశేషం. పోటీగా మరొక చిన్న సినిమా కూడా మహేష్ రికార్డులు బ్రేక్ చేసేలా ఉంది. తెలంగాణలోని హైదరాబాదులోనే ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవాలని సైమా నిర్వాహకులు ప్లాన్ సెట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 11 నుంచి 12 వరకు అవార్డుల ప్రధానోత్సవం జరగనుందట.

 మహర్షి సినిమా..

మహర్షి సినిమా..

మహేష్ బాబు ఉ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా మహర్షి 2019 లో విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశం కూడా ఉండడంతో సినిమా మా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. ముఖ్యంగా అల్లరి నరేష్ పాత్ర ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలిచింది.

నేషనల్ అవార్డు..

నేషనల్ అవార్డు..


ఇది వరకే ఈ సినిమాకు పలు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చిత్ర యూనిట్ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది. అలాగే సినిమాలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా కూడా రాజు సుందరం జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. స్నేహం విలువలతో పాటు రైతులకు సంబంధించిన సమస్యలను ఒక సమాధానంలా చూపించిన మహర్షి సినిమా కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కడం తెలుగు పరిశ్రమకు ప్రత్యేకమైన గౌరవం అని చెప్పొచ్చు.

పది అవార్డులకు నామినేషన్స్

పది అవార్డులకు నామినేషన్స్

అంతేకాకుండా సైమా వేడుకల్లో కూడా మహర్షి సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, విభాగాల్లో మొత్తం పది రకాల నామినేషన్స్ లో పోటీ పడుతుండటం విశేషం. ఈ సినిమా తప్పకుండా ఈ విభాగాల్లో కాస్త ఎక్కువ అవార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Recommended Video

Siima 2019 Awards Tollywood Winners Full List || Filmibeat Telugu
పోటీగా మలయాళం సినిమా

పోటీగా మలయాళం సినిమా


తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక నామినేషన్స్ లో నిలిచిన సినిమాగా కూడా మహేష్ మహర్షి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. మహర్షి సినిమా తో పాటు తమిళ్ లో అసురన్ సినిమా కూడా 10 రకాల నామినేషన్స్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక మలయాళంలో కుంబలంగి నైట్స్ అనే సినిమా 13 నామినేషన్స్ లో పోటీ పడనుంది. కన్నడలో యజమాన సినిమా 12 రకాల నామినేషన్స్ లో పోటీకి దిగుతోంది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ అవార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X