క్యాన్సర్ బాలికకు మహేష్ బాబు చేయూత.. అభిమానితో ప్రేమగా!
తన అభిమానులకు ఏదైనా కష్టం ఎదురైతే సినీ హీరోలు అండగా నిలిచే సందర్బాలను ఎన్నో చూశాం. తాజాగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన అభిమానికి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచి ప్రిన్స్ మహేష్ మానవత్వాన్ని ఉందని మరోసారి చాటుకొన్నారు. వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్విన్ బాబీ అనే బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్నది. ఆ విషయం తెలుసుకొన్న మహేష్‌బాబు ఆ బాధితురాలిని కలుసుకొన్నారు. ఆ బాలికతో తన విలువైన సమయాన్ని గడిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.

మహేష్ ప్రేమతో తన వద్దకు తీసుకొన్న నేపథ్యంలో పర్విన్ బాబి అనే అమ్మాయి చాలా ఆనందంలో మునిగిపోయింది. తన అభిమాన నటుడిని కలుసుకొన్న ఆనందంలో తన బాధలను కూడా మరిచిపొందని కుటుంబ సభ్యులు తెలిపారు.



Click it and Unblock the Notifications











