నమ్రతతో పెళ్లికి అడ్డుగా ఆమె .. కృష్ణ ఫ్యామిలీకి ముచ్చెమటలు, మహేశ్‌ని సీక్రెట్‌‌గా

సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మహేశ్ బాబు .. బాల నటుడిగా ఉన్నప్పుడే భవిష్యత్తులో తాను ఏం సాధించబోతున్నాడో హింట్ ఇచ్చాడు. పెరిగి పెద్దయిన తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా టర్నర్ అయిన మహేశ్ తొలినాళ్లలో కాస్త ఇబ్బంది పడినా తర్వాత నిలదొక్కుకున్నారు. తండ్రి బాటలోనే ప్రేమ వివాహం వైపు అడుగులు వేసిన ప్రిన్స్.. తాను మనసిచ్చిన నమ్రతను పెళ్లాడారు. అయితే ఈ వివాహం అంత ఈజీగా జరగలేదు. ఈ వివరాల్లోకి వెళితే..

ఘట్టమనేని కృష్ణ , ఇందిరా దేవిలకు 1975 ఆగస్ట్ 9న జన్మించిన మహేశ్ .. బాలనటుడిగా 1979లో నీడ అనే సినిమాలో కనిపించారు. అనంతరం చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి కృష్ణ, అన్నయ్య రమేశ్ బాబు చిత్రాలలో నటించారు. చదువు లేకపోతే భవిష్యత్తులో కొడుకు ఇబ్బంది పడతాడన్న ఉద్దేశంతో మహేశ్‌కి బ్రేక్ ఇచ్చారు కృష్ణ. అనంతరం దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాతగా రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు.

mahesh babu namrata shirodkar Marriage Super Star s grandmother prevented this marriage

తొలినాళ్లలో వరుస ప్రేమ కథలతో లవర్ బాయ్ ఇమేజ్ సాధించారు మహేశ్. అయితే మురారి నుంచి ఆయన కథల ఎంపిక మారింది. విభిన్నమైన కథలతో ఆడియన్స్‌ ముందుకొస్తున్న మహేశ్‌ కెరీర్‌ను ఒక్కడు మలుపు తిప్పింది. ఆ తర్వాత అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం తదితర చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాశారు. ప్రిన్స్‌ నుంచి సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించి భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

మహేశ్ జీవితం నమ్రతకు ముందు .. నమ్రత తర్వాత అన్నట్లుగా ఉంటుంది. ఆమె ఆయన లైఫ్‌లో అడుగుపెట్టిన తర్వాతి నుంచి మహేశ్ బాబు స్టైల్ పూర్తిగా మారిపోయింది. అన్ని విషయాల్లో ఆయనకు అడ్వైజర్‌గా, ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటూ మహేశ్‌‌పై ఒత్తిడి లేకుండా చేశారు. వంశీ సినిమా సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. తమ వ్యవహారం ఎక్కడా బయటపడకుండా గుట్టుగా ఉంచారు. ఓ రోజున నమ్రతతో మహేశ్ పెళ్లి ఫోటోలు బయటికి రావడంతో ఇండస్ట్రీతో పాటు అమ్మాయిలు షాకయ్యారు.

అయితే మహేశ్ పెళ్లి అంత ఆషామాషీగా జరగలేదట. తొలుత నమ్రతతో ప్రేమ వ్యవహారాన్ని మంజుల ద్వారా కృష్ణకు తెలియజేశారు మహేశ్. తొలి నుంచి అభ్యుదయ భావాలున్న మహేశ్ .. కుమారుడి పెళ్లికి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. కానీ మహేశ్ అమ్మమ్మకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండటంతో ఆమె దెబ్బకు కృష్ణ కుటుంబం వణికిపోయిందట. దీంతో సీక్రెట్‌గా పెళ్లి పనులు చేసుకుంటూ వచ్చారు కృష్ణ.. చివరికి మీడియాకు కానీ, ఇండస్ట్రీకి కానీ ఎలాంటి సమాచారం లేకుండా ముంబైలో ఇరు కుటుంబాల సమక్షంలో మహేశ్ - నమ్రతల పెళ్లి జరిగిందని స్వయం కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నమ్రత చాలా తెలివైన అమ్మాయి అని.. ఆమె వల్ల మహేశ్‌కు ఫ్రీ హ్యాండ్ దొరికిందని కోడలిని ప్రశంసించారు సూపర్‌స్టార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X