మహేశ్ బాబు కొడుకు గౌతమ్ వల్ల.. 12,000 మంది పసి ప్రాణాలకు రక్షణ!
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు ఘట్టమనేని పేరు ప్రతిష్టలను నిలబెడుతున్నారు. తండ్రికి మించిన తనయుడు అనిపిస్తున్నారు మహేశ్ బాబు. సినిమాల విషయంలోనే కాకుండా.. తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆయన కుటుంబం కూడా తాత కృష్ణ, మహేశ్ బాబు చూపిన బాటలోనే నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా మారుతున్నారు. కాగా మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా ఎంతో మంచి పేరును దక్కించుకుంటోంది. అయితే పెద్దింట్లో పుట్టడమే కాదు.. గొప్ప మనస్సు కూడా కలిగి ఉందని నమ్రతా శిరోధ్కర్ తెలియజేశారు. అదెలా అని ఆలోచిస్తున్నారా..?
మహేశ్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబు కు సంబంధించిన అన్ని బిజినెస్ లను భార్య నమ్రతా శిరోధ్కర్ చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు మహేశ్ బాబు ఆదేశానుసారం సేవా కార్యక్రమాలు కూడా చేస్తు ఎంతో మంది జీవితాలను చక్కదిద్దుతోంది నమ్రతా. ఇప్పటికే కొడుకు గౌతమ్ ఘట్టమనేని కారణంగా మహేశ్ బాబు ఎంబీ ఫౌండేషన్ ను స్థాపించి చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే.
మహేశ్ బాబు ప్యూ ర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా వేలాది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు మహేశ్ బాబు. కాగా ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా 4500కు పైగా చిన్నారులకు పిడియాట్రిక్ హార్ట్ సర్జరీలు ఉచితంగా చేయించారు. ఖర్చుతో కూడుకున్న వైద్యం కావడంతో పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు పైసా తీసుకోకుండా సర్జరీలు చేస్తున్నారు. రెయిన్ బో హాస్పటిల్స్, ఏపీ హస్పిటల్స్ సాయంతో ఈ సాయం చేయగలిగామని నమ్రతా తెలిపారు.

ఇదిలా ఉంటే... రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో మదర్ మిల్క్ బ్యాంక్ ను స్థాపించారు. సెర్వికల్ క్యానర్ ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవన్ ను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇది అమ్మాయిలకు అందిస్తున్న వైద్యం. ఆంధ్రప్రదేశ్ లోని ఆస్పత్రుల ద్వారా ఈ కార్యక్రమానికి నమ్రతా మహేశ్ శ్రీకారం చుట్టారు. రీసెంట్ గా ప్రారంభించారు కూడానూ. ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా 7500 చిన్నారులకు సాయం అందనుంది. ఇలా మొత్తం మహేశ్ బాబు, నమ్రతా శిరోధ్కర్ 12000 మంది చిన్నారుల ప్రాణాలను రక్షిస్తున్నారు.
అయితే, ఈ గొప్ప కార్యానికి కారణం మాత్రం మహేశ్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేనినే. గౌతమ్ పుట్టిన వెంటనే బ్రీత్ ప్రాబ్లంతో చాలా రోజులు ఆస్పత్రిలోనే ఉన్నారంట. చాలా బక్కగా ఉండి ఎదుగుదల కనిపించలేదంట. హార్ట్ కు సంబంధించిన పలు ట్రీట్ మెంట్స్ అందించాక గౌతమ్ తమకు దక్కాడని మహేశ్ బాబు 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో ఒకసారి చెప్పారు. అలా తమకు డబ్బు ఉండటం వల్ల గౌతమ్ దక్కాడని, మరీ డబ్బులేని వారి పరిస్థితి ఏంటనే ఆలోచన మహేశ్ బాబుకు కలిగిందంట. ఇక గౌతమ్ జననం తర్వాత నుంచి ఈ సేవ కార్యక్రమాలను మొదలు పెట్టాలని భావించి ప్రస్తుతం వేలమంది చిన్నారులకు వైద్య సాయం అందిస్తున్నారు.
ఇక మహేశ్ బాబు - నమత్రా శిరోధ్కర్ 2005 ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ చిత్రంతో వీరికి పరిచయం ఏర్పడి, ప్రేమగా మారి మూడుముళ్ల బంధంలోకి అగుడుపెట్టారు. ఈ ఏడాదితో 20 ఏళ్ల బంధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎన్నో జంటలు విడిపోతున్నా.. వీరు మాత్రం స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా మారారు. ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి గౌతమ్ 2006 ఆగస్టు 31న జన్మించారు. ఆ తర్వాత సితార పుట్టింది.


Click it and Unblock the Notifications











