AMB victory: మహేష్ బాబుతో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న దగ్గుబాటి హీరోస్

సినిమా ఇండస్ట్రీలో సినీ నటులు ఆదాయం ఎంత బాగా వచ్చినా కూడా బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక ఆధారం లేకపోతే మాత్రమే చివరి దశలో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా ఉదాహరణలు ఎన్నో గుణ పాఠాలు నేర్పాయి. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ముందు జాగ్రత్తగా కొన్ని వ్యాపారాలను కూడా ఆధారంగా చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం అగ్రహీరోలు ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ పై ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏషియన్ సినిమాస్ తో కలిసి ఇప్పటికే కొందరు హీరోలు ప్రత్యేకంగా థియేటర్స్ బిజినెస్ లోకి దిగుతున్నారు. త్వరలోనే దగ్గుపాటి హీరోలు కూడా ఆ లిస్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

మొదట ఆ హీరోతో

మొదట ఆ హీరోతో

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏషియన్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సునీల్ నారంగ్ ఆధ్వర్యంలో మన హీరోలు ప్రత్యేకంగా పాట్నార్షిప్ చేస్తూ థియేటర్స్ వ్యాపారాలను చాలా గ్రాండ్ గానే ఓపెన్ చేస్తున్నారు. మొదట మహేష్ బాబు AMB సినిమాస్ గ్రాండ్ గా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇండియాలోనే బెస్ట్ థియేటర్స్ లలో AMB టాప్ లిస్ట్ లో నిలుస్తోంది.

అల్లు అర్జున్ కూడా

అల్లు అర్జున్ కూడా

మహేష్ AMB సినిమాస్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత మరికొంతమంది హీరోలకు కూడా ఆ రూట్లో వెళ్లాలని ఆశ కలిగింది. దీంతో ఏషియన్ సినిమాస్ ప్రత్యేకంగా ఆఫర్ చేయడంతో చాలా మంది ముందుకు వచ్చారు. అయితే కొందరు మాత్రం మరికొంత సమయాన్ని తీసుకోవాలని ఏషియన్ సినిమాస్ తో చర్చలు జరిపారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ఒక పాత థియేటర్లు కొనుగోలు చేసి పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది.

విజయ్ AVD

విజయ్ AVD

ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో మొదటి సారి ఒక అతిపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ను ఓపెన్ చేశాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి AVD అనే మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. అందులో మొదటగా లవ్ స్టోరీ సినిమాను కూడా ప్రదర్సించారు. AVD కి మంచి స్పందన వస్తుంది అని విజయ్ దేవరకొండ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
 దగ్గుబాటి హీరోలు కూడా..

దగ్గుబాటి హీరోలు కూడా..

త్వరలోనే మరికొంతమంది యువ హీరోలు కూడా ఏషియన్ సినిమాస్ తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్స్ ను గ్రాండ్ గా లాంచ్ చేయాలని చూస్తున్నారు. అయితే అందరి కంటే విభిన్నంగా దగ్గుబాటి హీరోలు మహేష్ బాబును కూడా భాగస్వామిగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గచ్చిబౌలిలో అత్యాధునిక టెక్నాలజీతో AMB సినిమాస్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి వెంకటేష్ దగ్గుబాటి ఇద్దరు కూడా మహేష్ ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB విక్టరీ అనే మల్టీప్లెక్స్ ను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, సింగిల్ స్క్రీన్ హబ్ అయిన RTC X రోడ్స్ నెమ్మదిగా మల్టీప్లెక్స్ అరేనాగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X