మహేష్ కోసం రాజమౌళి న్యూ కాన్సెప్ట్.. అంతకు మించి!
దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తరువాత ఏ హీరోతో వర్క్ చేస్తాడు అనే సందేహనికి ఇటీవల క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజమౌళి అనుమానాలు లేకుండా మహేష్ సినిమాపై ఫైనల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాల డోస్ అకాశాన్ని దాటేసింది. పైగా కొన్ని రూమర్స్ కూడా ఆడియెన్స్ లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

RRR అయిపోగానే..
సాధారణంగా రాజమౌళి ఒక సినిమా అయిపోగానే ఒక నెల పాటు ట్రావెల్ చేయడంలోనే బిజీగా ఉంటాడు. కుటుంబ సబ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే జక్కన్న RRR తరువాత పెద్దగా గ్యాప్ తీసుకునే అవకాశం లేదట. లాక్ డౌన్ లోనే రాజమౌళి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టాడు. ఇక ఆ సినిమా అయిపోగానే కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ తీసుకొని కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారట.

స్క్రిప్ట్ రెడీ..
మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అసలైతే మహేష్ కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ మెయిన్ కథను ఎప్పుడో సిద్ధం చేశాడు. కానీ దాన్ని డెవలప్ చేయడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అంతకు మించి..
మహేష్ బాబు జక్కన్న సినిమాలో ఎలా కనిపించబోతున్నాడనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. రాజమౌళి మైండ్ లో మాత్రం మహేష్ ని ఒక హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో స్టైలిష్ గా చూపించాలని అనుకుంటున్నారట. గతంలోనే ఒకసారి మహేష్ జేమ్స్ బాండ్ వంటి రోల్స్ కి కరెక్ట్ గా సెట్టవుతాడని చెప్పాడు. ఇక ఇప్పుడు అంతకుమించి రాజమౌళి మహేష్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.
Recommended Video

రాజమౌళి న్యూ కాన్సెప్ట్..
రాజమౌళి ఇంతవరకు టచ్ చేయని ఒక స్టైలిష్ కాన్సెప్ట్ ని టచ్ చేయబోతున్నారట. మాఫియా నేపథ్యంలోనే మహేష్ లుక్కును స్టైలిష్ గా ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నారట. స్క్రిప్ట్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను కూడా జక్కన్న ఫినిష్ చేసినట్లు సమాచారం. ఇక RRR అయిపోతే గాని మహేష్ రాజమౌళి కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేలా లేదు. పాన్ ఇండియా సినిమాగానే వీరి చిత్రం రూపొందనుంది.


Click it and Unblock the Notifications











