వైరల్ పిక్: రాముడిగా మొదటిసారి మహేష్ బాబు.. ఆదిరింది సామి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పౌరాణిక చిత్రాలు వచ్చి చాలా కాలమవుతోంది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నర్ వంటి సీనియర్ హీరోలు దేవుళ్లను కలల నుంచి ప్రత్యక్ష ప్రతిరూపాలుగా తీసుకువచ్చారు. ఎన్ని దశాబ్దాలు మారుతున్నా కూడా రాముడు, శ్రీ కృష్ణుడు అనే పేరు వినబడగానే మొదట గుర్తుకు వచ్చేది అన్నగారి రూపమే. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మహేష్ కూడా రాముడిగా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Recommended Video

Mahesh Babu As Lord Rama, Fan Made Poster Goes Viral
 మహేష్ రాముడిగా..

మహేష్ రాముడిగా..

మహేష్ బాబు ఈ విదంగా రాముడిగా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఊహను అందుకోవడం చాలా కష్టం. కానీ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న కాలంలో ఊహలకు ప్రతిరూపం ఇచ్చి నిజంగా నమ్మగాలిగేలా చేస్తున్నారు. మహేష్ బాబును రాముడిగా ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది నిమిషల్లో వైరల్ అయ్యింది.

మైండ్ బ్లాక్.

మైండ్ బ్లాక్.

రాముడి ఆహార్యం, చిరునవ్వు ఇలానే ఉంటుందేమో అనేలా ఆలోచనలను కలిగిస్తున్న ఈ లుక్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సూపర్ స్టార్ ఈ విధంగా దర్శనమివ్వడం చూస్తూంటే ఆయన పౌరాణిక సినిమాలు కూడా చేయడానికి సెట్టవుతారని చెప్పవచ్చు. రాముడి పాత్రకు మహేష్ కరెక్ట్ సెట్టవుతాడాని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

అది నిజం కాదు..

అది నిజం కాదు..

సడన్ గా ఒక నిమిషం పాటు ఆ ఫోటో చూస్తూంటే మహేష్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఏమైనా రిలీజ్ అయ్యిందా అనే భావన కలుగుతొంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రాముడిగా మహేష్ కనిపించబోతున్నాడా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. కేవలం అభిమానులు ఈ ఫోటోని సరదవా ఎడిట్ చేశారు.

నెక్స్ట్ రాజమౌళితో..

నెక్స్ట్ రాజమౌళితో..

ఆ రూమర్స్ రాకపోవడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే నెక్స్ట్ మహేష్ బాబు జక్కన్నతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. RRR సినిమా తరువాత తప్పకుండా సినిమా ఉంటుందని దర్శకుడు కూడా క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఆ సినిమా కోసం మహేష్ ఫొటోలు ఈ విధంగా వైరల్ అవుతున్నాయా అనే రూమర్స్ వస్తున్నాయి. మరి భవిష్యత్తులో అయినా మహేష్ ఇలాంటి పాత్రలో కనిపిస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X