నెవ్వర్ బిఫోర్‌ లుక్కులో మహేశ్ బాబు: ఆ సినిమా కోసమే ఈ కొత్త అవతారం

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస విజయాలతో సత్తా చాటుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ బాణీలు అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట'లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సూపర్‌గా ఉంటుందట. ఇందులో మహేశ్ బాబు ఇప్పటి వరకూ చూడని డిఫరెంట‌్‌ లుక్కులో దర్శనవ్వబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జుట్టును పక్కకు దువ్వి కనిపించబోతున్నాడట. ఒక రకంగా చెప్పాలంటే పాత కాలం హీరోల మాదిరిగా ఉంటుందన్న మాట. అయితే, ఇది అతడి పాత్రేనా లేక ఇందులో మహేశ్ బాబు డుయల్ రోల్ చేస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సూపర్ స్టార్ గెటప్ సినిమాలోనే హైలైట్ అవబోతుందనే టాక్ బాగా వినిపిస్తోంది.

Mahesh Babu New Look for Sarkaru Vaari Paata Flashback Episode

ఇదిలా ఉండగా, 'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్ ఇటీవలే దుబాయ్‌లో జరిగింది. ఇందులో హీరో మహేశ్ బాబు ఇంట్రడక్షన్ చేజింగ్ ఫైట్‌ సీన్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే, హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ కూడా షూట్ చేశారు. ఫిబ్రవరి 20తో ఈ షెడ్యూల్ ముగిసింది. ఇక, రెండోది త్వరలోనే గోవాలో ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. అదే సమయంలో మహా శివరాత్రి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో కూడా రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీంతో ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X