For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu New Look: మహేశ్ కొత్త లుక్ వైరల్.. కటౌట్ అదిరిందిగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనలోని అన్ని టాలెంట్లను చూపిస్తూ తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మహేశ్ వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో సత్తా చాటాడు. దీంతో మరింత ఉత్సాహంగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు.

  ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

  ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి సూపర్ స్టార్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. కానీ, ఫుల్ రన్‌లో మాత్రం 90 శాతం మాత్రమే వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమా విడుదలైన తర్వాత హాలీడే ట్రిప్‌కు వెళ్లిన మహేశ్.. వచ్చిన వెంటనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకోబోతున్నాడని ప్రచారం జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.

  Mahesh Babu New Look for Trivikram Movie

  సూపర్ స్టార్ మహేశ్ బాబు కొన్ని నెలల క్రితమే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇక, జూలై నెల నుంచి ఈ సినిమా మొదలు అవుతుందని వార్తలు వచ్చినా అలా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో రెడీ అవబోతున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే తాజాగా అతడు స్టైలిష్ లుక్‌తో కనిపించాడు. తాజాగా మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు. ఇందులో ఈ స్టార్ హీరో జుట్టును వెనక్కి దువ్వుకున్న ఫోజుతో ఫ్యాన్స్‌కు మెంటలెక్కిస్తున్నాడు. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే సినిమా గెటప్ అని తెలుస్తోంది. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

  'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

  English summary
  Mahesh Babu recently Startes his 28 film with Trivikram Srinivas. Now His New Look Photo Gone Viral in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X