మహేశ్ బాబుకు కొత్త పేరు.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ లుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎంత పెద్ద ప్రాజెక్ట్ లో నటిస్తున్నారో తెలిసిందే. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా అత్యధిక బడ్జెట్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు రాబోయే చిత్రం రూపు దిద్దుకుంటోందన్న మాట ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తొలిసారి అడ్వెంచర్ ఫిల్మ్ నిర్మితమవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇండియా వైడ్ గా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, SSMB29 గురించి ఎప్పటికప్పుడు ఏదోక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్ గానే ఎస్ఎస్ రాజమౌళి నాని రాబోయే చిత్రం హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా ఏదైనా అప్డేట్ ఇస్తారా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ రాజమౌళి మాత్రం ఆ ప్రాజెక్ట్ గురించి ఏమాత్రం నోరు విప్పలేదు. కానీ నాని మాత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతూనే ఉందని, వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతుందని అదిరిపోయే న్యూస్ చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషి అయ్యారు.

రాజమౌళి సినిమా అంటే ఎంతలేదన్నా రెండు మూడేళ్ల సమయం పడుతుంది కదా.. మరీ నాని వచ్చే ఏడాదే రిలీజ్ చేయబోతున్నారని చెప్పడం ఏంటనే సందేహం ఉత్పన్నం అవుతోంది. కానీ మహేశ్ బాబు త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మహేశ్ బాబుకు సంబంధించిన లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. బాబుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ ఫొటోల్లో మహేశ్ బాబు భారీ గడ్డం, లాంగ్ హెయిర్ లో కనిపించారు. భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి ముచ్చటిస్తూ కనిపించారు. మరో వ్యక్తితో ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉండిపోయారు. అందుకు సంబంధించిన లుక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే మహేశ్ బాబు కాజువల్ లుక్ కే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో మహేశ్ బాబుకు కొత్త పేరును నామకరణం చేశారు. 'ఎస్ఎస్ఎంబీ29 లయన్' అంటూ పిలుస్తున్నారు. ఆ ఫొటోలను సింహాలతో ఎడిట్ చేస్తూ బాబు మాస్ లుక్ ను ఇంటర్నెట్ లో వైరల్ గా మార్చుతున్నారు.
మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ29 రెగ్యులర్ షూటింగ్ లోనే ఉంటున్నారని తెలుస్తోంది. ఇక జక్కన్న కూడా ఎక్కడా ఆలస్యం లేకుండా వెంటవెంటనే షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్, ఇండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











