మహేష్ కోసం మాస్ కథను సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్
సరిలేరు నికేవ్వరు సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో సక్సెస్ అందుకున్న ప్రిన్స్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు తన తదుపరి సినిమాపై ఎలాంటి ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు.

డిస్కర్షన్స్...
మహేష్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా సేఫ్ జోన్ లో సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. స్పైడర్ అనంతరం ప్రయోగాత్మక కథలను చాలా వరకు దూరం పెడుతున్నాడు. ప్రస్తుతం దర్శకులతో కథలకు సంబంధించిన డిస్కర్షన్స్ లో ఉన్నాడట. ఇప్పటికే కొన్ని కథలపై పాజిటివ్ గా స్పందించిన మహేష్ మరొక్కసారి విని వాటిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నాడు.

ఆ దర్శకుడితోనే నెక్స్ట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు గాని దాదాపు అతనితోనే వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో సినిమా చేయాలని దర్శకుడు కూడా మరొక ఛాన్స్ వచ్చినా దాన్ని వాయిదా వేసుకున్నాడు. దర్శకుడి కాన్సెప్ట్ పై మహేష్ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హరీష్ శంకర్ ప్రాజెక్ట్..
గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ మహేష్ బాబుతో సినిమా చేయాలని గత కొంత కాలంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య ఇంటర్వ్యూలో కూడా మహేష్ తో త్వరలోనే ఒక సినిమా ఉంటుందని చెప్పాడు. మహేష్ కూడా రెగ్యులర్ దర్శకులతో కాకుండా హరీష్ శంకర్ లాంటి దర్శకులతో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ పవన్ తో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత మహేష్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉందట.
Recommended Video

గ్యాప్ రాకూడదని..
సరిలేరు నికేవ్వరు సినిమా రిలీజ్ అనంతరం మహేష్ వెంటనే వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ కథ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ సెట్టవ్వలేదు. ఇక పరశురామ్ సినిమా అయిపోగానే ఎక్కువగా గ్యాప్ రాకూడదని మహేష్.. హరీష్ శంకర్ తో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ సినిమా అనంతరం హరీష్ వచ్చే ఏడాది మహేష్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.


Click it and Unblock the Notifications











