twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీతో మహేష్ బాబు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. వారం పాటు అందరూ కలిసి అక్కడే

    |

    సామాన్య జనమే నూతన సంవత్సరానికి పెద్ద పెద్ద ప్లాన్‌లు వేస్తుంటారు. అది చేద్దాం.. ఇది చేద్దాం.. అంటూ ప్రణాళికలు వేసుకుంటారు. అలాంటిది సెలెబ్రిటీలు ఖాళీగా కూర్చుంటారు. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఫ్యామిలీ మ్యాన్ ఊరికే ఉంటాడా?. పిల్లలకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి, వారిని హ్యాపీగా ఉంచుతాడు కదా. మహేష్ కొత్త ఏడాది వేడుకలను జరుపుకోవడానికి చెక్కేశాడని తెలుస్తోంది.

    ఒక్కో వారం ఒక్కో పాట..

    ఒక్కో వారం ఒక్కో పాట..

    మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, పాటలు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఒక్కో వారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ హల్ చేసిన చిత్రబృందం రీసెంట్‌గా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఆ మధ్య విడుదల చేసిన సరిలేరు టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

    గ్రాండ్‌గా ఈవెంట్..

    గ్రాండ్‌గా ఈవెంట్..

    సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా తీసుకురానున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలైన దిల్ రాజు, అనిల్ సుంకర, అనిల్ రావిపూడి మెగాస్టార్‌ను ఆహ్వానించేందుకు వెళ్లారు. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్‌ 2020లో జరిగే మొట్టమొదటి అతి పెద్ద ఈవెంట్‌గా రికార్డులకెక్కబోతోంది.

     ఫ్యాన్స్‌తో ఫోటోషూట్..

    ఫ్యాన్స్‌తో ఫోటోషూట్..

    సరిలేరు చిత్రం విడుదలకు దగ్గరపడుతుండటం.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో మహేష్ బాబుతో ఫ్యాన్స్ కోసం ఓ ఫోటో షూట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

    ముంబైకి బయల్దేరిన కుటుంబం..

    తన డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్న మహేష్.. కొత్త ఏడాదిని ఫ్యామిలీతో గడిపేందుకు భారీగానే ప్లాన్ చేశాడు. వీరంతా ముంబైలో న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. ముంబైకి బయల్దేరుతున్నట్లుగా నమ్రత షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    English summary
    Mahesh Babu New Year Celebrations With Family In Mumbai. Mahesh Babu Sarileru Neekevvaru Movie Directed by Anil Ravipudi and music composed by Devi Sri Prasad. Sarileru Neekevvaru movie is produced by AK Entertainments and GMB Entertainment. Presented by Sri Venkateswara Creations. This Movie Is Going to Releases On 11th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X