వివరాలు లీక్: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ముహూర్తం ఫిక్స్ చేసిన మహేశ్ బాబు.!

By Manoj Kumar P

హ్యాండ్సమ్ లుక్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్ చేయగలిగిన తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అందుకే ఆయన టాలీవుడ్‌లో చాలా కాలంగా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటున్నాడు. దీనికితోడు సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మహేశ్ బాబు ఫ్యూచర్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. అంతేకాదు, ఓ పనికి ముహూర్తం ఫిక్స్ చేశారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

హ్యాట్రిక్ కొట్టిన మహేశ్.. మైలురాయికి చేరువ

హ్యాట్రిక్ కొట్టిన మహేశ్.. మైలురాయికి చేరువ

సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్లకు తోడు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు'తో వచ్చి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. అంతేకాదు, తాజాగా యాభై రోజులు కూడా పూర్తి చేసుకుని దూసుకుపోతోంది.

సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్

సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్

తనకు ‘మహర్షి'తో భారీ విజయాన్ని అందించిన వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని సదరు దర్శకుడే వెల్లడించాడు. దీంతో స్క్రిప్ట్ కూడా రెడీ చేసేశాడు వంశీ. విశాఖపట్నంలోని హార్బర్‌ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో మహేశ్ బాబు స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడని ప్రచారం జరిగింది.

స్టైలిష్ డైరెక్టర్‌కు షాక్.. అభిమానుల్లో నిరాశ

స్టైలిష్ డైరెక్టర్‌కు షాక్.. అభిమానుల్లో నిరాశ

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే ఈ సినిమా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో... ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను ఆపేశారనేదే ఆ వార్త సారాంశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే తెలియలేదు కానీ, ఈ మూవీ ఆగిపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు కీ రోల్

చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు కీ రోల్

వంశీ పైడిపల్లితో సినిమా ఆగిపోయిందన్న వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలోనే మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. అదే.. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో మహేశ్ నటిస్తున్నాడనడం. అవును.. ఆ మూవీలో సూపర్ స్టార్ కీలక పాత్ర చేస్తున్నాడని తెలుస్తోంది.

 సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్

సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్

మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ నటిస్తున్నాడన్న వార్త అధికారికంగా ప్రకటించలేదు. దీంతో మహేశ్ బాబు తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ లీక్ అయింది. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురాంతోనే మహేశ్ సినిమా చేయబోతున్నాడట. దీన్ని భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం.

Recommended Video

Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet | Filmibeat Telugu
ముహూర్తం ఫిక్స్ చేసిన మహేశ్ బాబు.!

ముహూర్తం ఫిక్స్ చేసిన మహేశ్ బాబు.!

గతంలో మహేశ్‌కు పరశురాం ఓ కథను చెప్పిన విషయం తెలిసిందే. దానిలోనే మార్పులు చేసి ఇటీవల మరోసారి వినిపించాడట. ఈ కథ ఆయనకు బాగా నచ్చేసిందట. దీంతో ఈ సినిమాను ఉగాది రోజు (మార్చి 25)న అధికారికంగా ప్రారంభించబోతున్నారని తాజా సమాచారం. అలాగే రెగ్యూలర్ షూటింగ్‌ను జూన్ మొదటి వారం నుంచి మొదలెట్టబోతున్నారని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X