మహేష్‌ని మెప్పించలేకపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్!

అర్జున్ రెడ్డి చిత్రంలో యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. డెబ్యూ మూవీ తోనే సంచలన విజయం సాధించడంతో సందీప్ పేరు మారుమోగింది. ఎమోషనల్ లవ్ స్టోరీతో అందరిని మాయ చేశాడు. దీనితో సందీప్ రెడ్డితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తరువాత నుంచి సందీప్ సూపర్ స్టార్ మహేష్ తో టచ్ లో ఉంటున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ గురించి గతంలోనే ఆసక్తికరవార్తలు వచ్చాయి.

మహేష్ బాబుకు సందీప్ వంగ ఓ స్టోరీ లైన్ వినిపించాడని, పూర్తి కథ సిద్ధం చేయమని మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. సందీప్ వంగ ఇటీవల పూర్తి కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది దానికి మహేష్ బాబుకు వినిపించాడట. కానీ మహేష్ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కథలో హీరో పాత్ర తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యేలా లేదని మహేష్ భావించాడట. అందువల్లనే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Mahesh Babu not impressed with Sandeep Vanga story

దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంతో బిజీగా ఉన్నాడు. మహర్షి చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక సందీప్ వంగ అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X