మహేష్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఆ ఒక్క రోజే మూడు రాబోతున్నాయి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం వెంటనే మరొక మూవీతో రావాలని ప్రయత్నాలు బాగానే చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక ఈ ఏడాది మహేష్ మొత్తనికే కనిపించడని క్లారిటీ వచ్చేసింది. అయితే ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని మహేష్ డిసైడ్ అయ్యాడు.
Recommended Video

పవన్ కళ్యాణ్ అభిమానులకు తప్పితే..
సాధారణంగా అభిమానులు స్టార్స్ సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. విడుదలయ్యే ఒకరోజు ముందు నుంచే థియేటర్స్ వద్ద సంబరాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఈసారి పవన్ కళ్యాణ్ (వకీల్ సాబ్) అభిమానులకు తప్పితే ఏ పెద్ద స్టార్స్ అభిమానులకు కూడా ఆ ఛాన్స్ దక్కలేదు.

చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.
అసలు మహేష్ బాబు మంచి కథలు వస్తే ఏడాదికి మూడు సినిమాలు చేయడానికైనా రెడీగా ఉంటాడు. కానీ కథలు అలా వర్కౌట్ అవ్వడం లేదు. మినిమమ్ రెండు సినిమాలతో అయినా రావాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఇక వచ్చే ఎడాది ఆ కల నిజమయ్యే ఛాన్స్ అయితే ఉంది.

వచ్చే ఏడాది.. రెండు సినిమాలు
పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట ఈ ఏడాది దసరా టైమ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు వచ్చే సంక్రాంతికి షిఫ్ట్ చేశారు. ఇక ఆ తరువాత సమ్మర్ లో త్రివిక్రమ్ సినిమాను తేవాలని డిసైడ్ అయ్యారు. ఆ సినిమా నెవర్ బిఫోర్ అనేలా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రానుంది.

ఒకేసారి 3 అప్డేట్స్
ప్రతి ఏడాది ఎలాంటి పరిస్థితుల్లో అయినా మహేష్ మే 31న ఏదో ఒక అప్డేట్ తో అభిమానులను సంతోష పరుస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒకేరోజు మూడు అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సర్కారు వారి పాట ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేస్తారట. ఇక త్రివిక్రమ్ సినిమాను అఫీషియల్ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి నటీనటులను, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను కూడా అందిస్తారని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











