మహేశ్‌బాబు, రాజమౌళిల ఫైట్.. ఆ వీడియోను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ..
సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి (Varanasi). ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్తు సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది. ఈ భారీ అడ్వెంచర్ డ్రామాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ ఎపిక్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యిందట.దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటీ? అసలేం జరిగింది?

మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. జక్కన్న విజన్‌కు తగ్గట్టుగా మహేష్‌ను గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారని టాక్. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌తో ఈ సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7ను రిలీజ్ డేట్‌గా టార్గెట్ చేస్తున్నారట.
AI వీడియోతో సోషల్ మీడియా షేక్!
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అయింది. కాఫీ షాప్ బ్యాక్‌డ్రాప్‌లో మహేష్ బాబు - రాజమౌళి ఇద్దరూ ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని సినిమాటిక్ స్టైల్‌లో కొట్టుకుంటున్నట్టు ఉన్న విజువల్స్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదటిసారి చూసిన చాలామంది ఇది నిజమైన గొడవేమో అనుకున్నారు. అయితే తర్వాత బయటపడిన నిజం ఏంటంటే... అది అసలు రియల్ వీడియో కాదు.. అత్యాధునిక ఏఐ (AI)టూల్‌తో క్రియేట్ చేసిన ఫేక్ ఫైట్ వీడియో. ఈ వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma)తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నిమిషాల్లో వైరల్ అయిపోయింది. పైగా సినిమా ఇస్ డెడ్ (Cinema is dead) అంటూ క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు.
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అద్భుతంగా రియాలిటీని రీ-క్రియేట్ చేస్తుందో మరోసారి చూపించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో సరదా కామెంట్స్ వర్షం కురుస్తున్నారు. 'మహేష్ సమ్మర్ వెకేషన్‌కు వెళ్లాలంటే రాజమౌళి పర్మిషన్ ఇవ్వలేదేమో..', 'జక్కన్న సెట్ టార్చర్ భరించలేకే మహేష్ రెచ్చిపోయాడట!' అంటూ ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు. మరికొందరు మాత్రం 'AI ఇంతలా ఎదిగిపోయిందా? నిజం-అబద్ధం తేడా చెప్పలేని స్థాయికి వచ్చేసింది' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫేక్ ఫైట్ వీడియోతో మరోసారి ఏఐ(AI) టెక్నాలజీ పవర్ బయటపడింది. ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తించలేని స్థాయికి విజువల్స్ వచ్చేయడంతో, భవిష్యత్తులో సినిమాల ప్రమోషన్స్ కూడా ఏఐ ఆధారంగానే మారిపోతాయా? అనే చర్చ మొదలైంది. ఒకవైపు 'వారణాసి' కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు ఇలాంటి ఏఐ ప్రయోగాలు సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచుతున్నాయనే చెప్పాలి.
ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. జక్కన్న మార్క్ అడ్వెంచర్‌లో మహేష్ ఎలా కనిపించబోతున్నాడు? 2027 వరకు ఈ హైప్ అలాగే కొనసాగుతుందా? ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వారణాసి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుంది? ప్రపంచ వ్యాప్తం ఈ మూవీ ఎన్ని కోట్ల బిజినెస్ చేయబోతుందనేది వేచిచూడాలి.


Click it and Unblock the Notifications










