Varanasi : వారణాసి టైటిల్ కాంట్రవర్సీకి చెక్! జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..

Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఇటీవల గ్లోబ్ ట్రాట్టర్ (GlobeTrotter) ఈవెంట్‌లో టైటిల్ గ్లింప్స్‌ను గ్రాండ్‌గా ప్రకటించారు. తర్వాత.. ఈ పేరును ముందే రిజిస్టర్ చేసినట్టు ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం చాంబర్‌ను ఆశ్రయించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తమ అనుమతి లేకుండా టైటిల్ వాడుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు టైటిల్ సమస్య ఎదురయ్యింది. తాజాగా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదానికి క్లారిటీ లభించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

గ్లోబల్ ఈవెంట్‌లో స్పెషల్ ప్రెజెంటేషన్‌తో టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచే 'వారణాసి' అనే పేరు ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. గ్లింప్స్‌లో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించిన తీరు, మరో మైథాలాజీ ప్రపంచాన్ని పరిచయం చేసే విజువల్స్ ప్రేక్షకుల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక వారణాసి మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. రిలీజ్‌కు ఇంకా ఏడాది దూరం ఉన్నప్పటికీ, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా ద్వారా ముందుగానే ప్రమోషన్స్ ప్రారంభించారు. మహేష్ బాబు.. రుద్ర పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా.. మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్.. కుంభ పాత్రలో నటిస్తోన్నారు.

Mahesh Babu-Rajamouli s Varanasi Title Dispute Resolved with a Clever Twist

ఈ ప్రాజెక్ట్‌లో రాజమౌళి హాలీవుడ్ స్థాయి విజువల్ యూనివర్స్‌ను సృష్టించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్.దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నారాయణ నిర్మిస్తుండగా, ఈ విజువల్ వండర్ 2027 సమ్మర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. గతంలోనే వారణాసి పేరుతో టైటిల్ రిజిస్ట్రేషన్ అన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ.. తెలుగులో ఆ పేరు వారికి ప్రాధాన్యత ఉన్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదం పెద్దగా కాకుండా, టైటిల్‌లో చిన్న మార్పుతోనే రాజమౌళి పరిష్కరించడం ఇండస్ట్రీలో స్మార్ట్ మూవ్‌గా చెబుతున్నారు.

అసలు టైటిల్ ఎవరిది? వారణాసి టైటిల్‌ను ముందుగానే రామబ్రహ్మా హనుమ క్రియేషన్స్ (RamaBrahma Hanuma Creations) బ్యానర్‌పై నిర్మాత కె. విజయ్ రిజిస్టర్ చేశారు. గతంలో 'రఫ్' సినిమాలో ఆది సాయికుమార్ - రకుల్ ప్రీత్ సింగ్‌లను డైరెక్ట్ చేసిన సీహెచ్‌. సుబ్బారెడ్డి ఈ టైటిల్‌తో మాస్, కమర్షియల్, భావోద్వేగ అంశాలను, సనాతన ధర్మం గొప్పదనంను హైలైట్ చేస్తామని చెప్పి పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాత రాజమౌళి అదే పేరును ప్రకటించడంతోనే వివాదం మొదలైంది.

ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతల నుంచి రాజమౌళి పేరు కోసం హక్కులు కొనుగోలు చేస్తారనే ప్రచారం సాగినప్పటికీ, టైటిల్‌ను చిన్న మార్పుతో దాచకుండా నిలుపుకోవడమే దర్శకధీరుడి ప్లాన్ అని క్లోజ్ సర్కిల్ సమాచారం చెబుతోంది. ఇందుకు నెటిజన్స్ కూడా "జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదు" అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో రాజమౌళి టీం టైటిల్‌లో స్వల్ప మార్పు చేస్తేనే వివాదం తగ్గుతుందన్న అభిప్రాయానికి వచ్చింది. అంతర్జాతీయ భాషల్లో మూవీ మాత్రం వారణాసి (Varanasi) పేరుతోనే విడుదల కానున్నప్పటికీ, తెలుగులో మాత్రం 'రాజమౌళి వారణాసి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: ss rajamouli Varanasi mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X