కేరళ అందాల్లో మహేష్ బాబు.. హీరోయిన్‌తో కలిసి! జరగబోయేది అదే..
కేరళ అందాల్లో వాలిపోయారట సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కోసం హీరోయిన్ రష్మిక మందన్న, చిత్ర యూనిట్‌తో కలిసి కేరళ రాష్ట్రంలో షూటింగ్‌లో పాల్గొంటున్నారట ఈ అందగాడు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ఫినిష్ చేసిన చిత్రబృందం కేరళ అందాల్లో మహేష్, రష్మిక రొమాన్స్‌ని కెమెరాలో బందిస్తోందట.
ముందుగా షెడ్యూల్ ప్రకారమే 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం మేర పూర్తయిందని తెలుస్తోంది. తాజాగా కేరళ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ ఫినిష్ అవుతుందని అంటున్నారు. ఇక్కడి నాచురల్ అందాల్లో మహేష్ బాబు, రష్మిక మందన్నలపై రెండు పాటలు, చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తోంది 'సరిలేరు నీకెవ్వరు' యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ రోల్ పోషిస్తుండటం విశేషం. ఇక విజయశాంతి పాత్ర సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు'. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్, విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజుతో పాటు మహేష్ బాబు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











