సౌత్ ఇండియా నుంచి కేవలం ‘ఒక్కడు’.. దటీజ్ సూపర్ స్టార్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఏమని చెప్పగలం. ఎంతని చెప్పగలం. తెలుగు ప్రేక్షకులకు ఆయన నెలకొల్పిన రికార్డుల గురించి తెలియనివా.. ఆయన ఇచ్చిన ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా. ఇలా ఎంత చెప్పుకున్నా మహేష్ బాబు గురించి తక్కువే అవుతుంది. ఎందుకంటే మహేష్ బాబు అనే పేరు కాదు ఇట్సే బ్రాండ్. అందుకే మహేష్ సినిమాలకు రికార్డులను వేటాడటం మాత్రమే తెలుసు.

వరుసగా బ్లాక్ బస్టర్స్..

వరుసగా బ్లాక్ బస్టర్స్..

శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా ప్రతీ ఒక్కటి బ్లాక్ బస్టరే. రికార్డులు నెలకోల్పడంలోనూ, బద్దలు కొట్టడంలోనూ వేటికవే సాటి. చివరగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మ్యానియా ఏ రేంజ్‌లో ఉండిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిసింది.

సోషల్ మీడియాలో ఫాలోయింగ్..

సోషల్ మీడియాలో ఫాలోయింగ్..

మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హలో వంటి సోషల్ మీడియా యాప్‌లో ప్రతీ సారి మహేష్ బాబే నెంబర్ వన్ ర్యాంకింగ్‌లో ఉంటాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఏది తీసుకున్నా మహేష్‌కు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది.

అందుకే మహేష్ ట్వీట్‌కు..

మహేష్ బాబు చేసే ఒక్క ట్వీట్ కొన్ని లక్షల మందికి చేరుకుంటుంది. అందుకు యాడ్స్, సినిమా టీజర్స్, ట్రైలర్స్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తారు. తాను నటించిన యాడ్స్‌ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ట్విట్టర్‌లో సౌతిండియా నుంచి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఒకే ఒక్క నటుడిగా మహేష్ బాబు రికార్ట్ సృష్టించాడు. తొంభై లక్షల (9 మిలియన్స్) మంది ఫాలోవర్స్ దిగ్గజ నటులను వెనక్కి తోసేశాడు.

Recommended Video

Pawan Kalyan Costly Gift To His Kids | Filmibeat Telugu
అందరికీ ధన్యవాదాలు..

అందరికీ ధన్యవాదాలు..

తమిళ నాట ఎంతో పెద్ద హీరోలని చెప్పుకునే విజయ్‌కు 2.3మిలియన్స్, రజినీకి 5.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మోహన్ లాల్ (5.9మి.), మమ్ముట్టి (1మి), పవన్ కళ్యాణ్ (3.8), సౌత్ స్టార్‌గా చెప్పుకునే అల్లు అర్జున్‌కు 3.8 మిలియన్ల ఫాలోవర్సే ఉన్నారు. వీరంతా మహేష్‌కు దరిదాపుల్లో కూడా లేరు. 9 మిలియన్లు చేరుకున్నందుకు మహేష్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. మహేష్ ఫాలోయింగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X