కరోనా ఎఫెక్ట్: రంగంలోకి టాలీవుడ్ తారలు.. మహేష్ బాబు రెస్పాన్స్ ఎలా ఉందంటే!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ క్రమేణా ప్రపంచ దేశాన్నింటికీ విస్తరిస్తుండటం ఆందోళన కలిగితోంది. ఇప్పటికే భారత దేశంలో కరోనా కేసులు గుర్తించబడటంతో ఈ వైరస్ గురించిన అవగాహన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సహా పలువురు టాలీవుడ్ తారలు రంగంలోకి దిగారు. వివరాల్లోకి పోతే..

కరోనా భూతం.. అల్లకల్లోలం
కరోనా భూతం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ప్రజలను వణికించుకుంటోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 3000 పైగా జనం మరణించడంతో ప్రజలు భాయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఈ వైరస్ అంటుకుంటుందో అని భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ రోజువారీ పనులు పూర్తి చేసుకుంటున్నారు.

హైదరాబాద్ చేరిన కరోనా.. ఉద్యోగులకు ఆదేశాలు
ఇకపోతే ఇటీవలే ఈ కరోనా వైరస్ హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది. అంతేకాదు ఇంకొందరిలో కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతుండటంతో పలు ఉద్యోగ సంస్థలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేశాయి.

మహేష్ బాబు సహా ఇంకొందరు..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతోంది. రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన పని లేదని చెబుతోంది. ఈ మేరకు టాలీవుడ్‌కి చెందిన స్టార్స్ మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, ఉపాసన, అఖిల్ అక్కినేనిలు కూడా ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
కరోనా వైరస్‌పై ఉపాసన ట్వీట్స్
రామ్ చరణ్ భార్య, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ కొణిదెల ఉపాసన కరోనా వైరస్‌పై ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. భయాందోళన చెందొద్దని, తగు జాగ్రత్తలు పాటిస్తే కోరినా బారిన పడకుండా ఉండొచ్చని చెబుతోంది. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ సోషల్ మీడియా సందేశాలిస్తోంది ఉపాసన.
Recommended Video

మహేష్ బాబు స్పందన.. అన్నింటికంటే ముందు!
ఇకపోతే కరోనా వైరస్‌పై స్పందించిన మహేష్ బాబు.. ‘‘భద్రతే అన్నిటికన్నా ముందు. భయాందోళన చెందొద్దు. జాగ్రత్తగా ఉండండి'' అని పేర్కొంటూ ప్రజల్లో ధైర్యం నింపారు. భయాందోళన చెందొద్దని సూచించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటనను పోస్ట్ చేస్తూ కరోనా పట్ల జాగ్రత్తలు చెప్పారు.


Click it and Unblock the Notifications











