చాలా రోజులు వెయిట్ చేశాం.. న్యాయం జరిగింది: మహేష్ బాబు
నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయడం పట్ల పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. ఈ మేరకు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చాలా రోజులు వెయిట్ చేశాం.. చివరకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
''ఇలాంటి సమయం కోసం చాలాకాలం పాటు వేచి చేశాం. న్యాయం జరిగింది. ఈ చర్య న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది. ఇన్నాళ్లు నమ్మకంతో పోరాటం చేసిన నిర్భయ తల్లిదండ్రులకు, న్యాయవాదులకు సెల్యూట్. న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది. ఇలాంటి దురాగతాలకు సత్వర న్యాయం దక్కాలి, బలమైన చట్టాలుండాలి'' అని మహేష్ బాబు సందేశం పోస్ట్ చేశారు.

2012 నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన మొత్తం నలుగురిని ఈ రోజు (మార్చి 20) ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీశారు. దీంతో ఎట్టకేలకు నిర్భయ కేసులో నిందితులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మల పాపం పండింది. ఈ ఉరితీతపై దేశవ్యాప్తంగా సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలుకావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రీతి జింటా, సుస్మిత సేన్, నాగ శౌర్య, హరీష్ శంకర్ సహా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











