వెటర్నరీ డాక్టర్ హత్య : వాడే మగాడు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైన సూపర్ స్టార్

హైదరాబాద్ నగర శివారులో జరిగిన ప్రియాంక రెడ్డి హత్య దేశం నలుమూలలను కదిలించింది. నిర్భయ ఘటన తరువాత అత్యంత ప్రభావాన్ని చూపిస్తోన్న ఈ ఉదంతంపై విద్యార్థి లోకం, మహిళ సంఘాలు, సామాజిక కార్యకర్తలు రోడ్డుపైకి ఎక్కారు. తక్షణమే ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలని నిరసనలు చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ ఘటనను ఖండిస్తూ.. తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

కదిలిన టాలీవుడ్..

కదిలిన టాలీవుడ్..

ప్రియాంక రెడ్డి ఘటన అనంతరం టాలీవుడ్ మొత్తం చలించిపోయింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూనే.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళలు కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, అత్యవసర సమయాల్లో పోలీసులను సంప్రదించాలని, ఎమర్జెన్సీ నంబర్లను సేవ్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.

చిరు సందేశం వైరల్..

చిరు సందేశం వైరల్..


గత రెండు మూడు రోజుల నుండి వినపడుతున్న ఆడపిల్లలపై హత్యాచారాలు అనే వార్తలు వింటుంటే ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావన కలుగుతోందని చిరంజీవి ఆవేదనకు లోనయ్యాడు. ఇటువంటి మృగాల మధ్యా.. మనం బ్రతుకుతోంది అని అనిపిస్తోందని అన్నాడు. ఈ అఘాయిత్యాలు వింటుంటే మనసు కలిచివేస్తోందని, అలాంటి వారిని నడిరోడ్డు మీద ఉరి తీసిన తప్పులేదని పేర్కొన్నాడు.

తాజాగా మహేష్ బాబు..


సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఘటనపై స్పందిస్తూ.. తన మనసులోని భావాలను ఓ కవిత రూపంలో మలిచి.. వాయిస్ ఓవర్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో.. ఎవరి మాట మన్ననగా ఉంటుందో.. ఎవరి మనసు మెత్తగా ఉంటుందో.. ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో.. ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో.. ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో అంటూ ఆలోచింప జేసేలా ఓ సందేశాన్ని ఇచ్చాడు.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
 వాడే మగాడు..

వాడే మగాడు..

వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో.. ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో.. స్త్రీకి శక్తింది.. గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో.. ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో.. అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మగాడు.. అంటూ ముగించేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X