ఇర్ఫాన్ ఖాన్ ఏకైక తెలుగు చిత్రమదే.. ‘పప్పు యాదవ్’గా మెప్పించిన నటుడు
ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. తన అసాధారణమైన నటనతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన ఇర్ఫాన్.. తెలుగు ప్రేక్షకులను నేరుగా కలిసి ఒకే చిత్రంతో కావడం గమనార్హం. అది కూడా విలక్షణ దర్శకుడు, విలనిజానికి కొత్త అర్థం చెప్పే డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన సైనికుడు చిత్రంతో టాలీవుడ్‌ను పలకరించారు. పప్పు యాదవ్‌గా ఇర్ఫాన్ తన నటనతో తెలుగువారి అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.
పప్పు యాదవ్ పవర్‌ను చూసి హీరోయిన్ వెంటపడటం, కామెడీ అండ్ లవ్ ట్రాక్‌లో ఇర్ఫాన్ తన నటన కౌశలాన్ని ప్రదర్శించడం మనమంతా చూశాం. ఎన్నో షేడ్స్ ఉన్న పాత్ర కావడం, హ్యాసాన్ని, విలనిజాన్ని చూపించిన పప్పు యాదవ్ పాత్రధారి ఇర్ఫాన్ నేడు అనంత లోకాలకు చేరుకున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ మృతితో సినీ ప్రపంచంలో శూన్యం ఏర్పడిందని బిగ్ బీ అంతటి వారే ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ మృతిపై మహేష్ బాబు స్పందింస్తూ తీవ్రంగా దు:ఖించాడు.

సైనికుడు మూవీ షూటింగ్‌లో ఇర్ఫాన్ ఖాన్‌తో దిగిన ఓ ఫోటోను మహేష్ బాబు షేర్ చేశాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఎంతో గొప్ప నటుడు ఇంత త్వరగా విడిచి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆత్మకు శాంతి చేకూరాల'ని కోరుకున్నాడు.


Click it and Unblock the Notifications











