హాట్ కేక్‌లా ‘సెల్ఫీఆఫ్ సక్సెస్’ మహర్షి ఎడిషన్, ఫ్యాన్స్‌కు రికమండ్ చేసిన మహేష్ బాబు!
'సెల్ఫీఆఫ్ సక్సెస్' పేరుతో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రాసిన ఓ పుస్తకం ఆన్ లైన్ అమ్మకాల వెబ్ సైట్ అమేజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. బిజినెస్ సెల్ఫ్-హెల్ప్ కేటగిరీలో నెం.1 బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.
మహర్షి ఎడిషన్ పేరుతో 'సెల్ఫీఆఫ్ సక్సెస్' పేరుతో ఇటీవలే దీన్ని విడుదల చేశారు. ఈ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మహేష్ బాబు దీన్ని అభిమానులకు రికమండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇది గొప్ప పుస్తకమం అంటూ ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన బుర్రా వెంకటేశంపై పొగడ్తలు గుప్పించారు.

దీన్ని అందరూ చదవాలని, విజయానికి నిజమైన అర్థాన్ని చెబుతూ ఇందులో పేర్కొన్న పలు ఉదాహరణలు ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులను చేస్తుందని తెలిపారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవండి, మీ స్నేహితులకు, సన్నిహితులకు దీన్ని బహుమతిగా ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు.
మహేష్ బాబు ట్వీట్‌తో ఈ పుస్తకానికి మరింత పబ్లిసిటీ లభించినట్లయింది. మహేష్ బాబు ట్విట్టర్లో 8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన అభిమానులు కూడా దీన్ని షేర్ చేస్తుండటంతో అమేజాన్లో అమ్మకాల జోరు పెరిగిందట.


Click it and Unblock the Notifications











