ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.. శర్వానంద్ శ్రీకారం టీజర్ వైరల్
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. శర్వానంద్ ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ప్రయోగాలు చేస్తాడు.. కొత్త కథలను ఎంచుకుంటాడనే పేరున్న శర్వానంద్‌కు గత కొన్నేళ్లుగా సక్సెస్ అనేది కరువు అయింది. చివరగా శతమానంభవతి వంటి చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తరువాత శర్వానంద్‌కు మళ్లీ ఓ హిట్ పడలేదు. అయితే ఇప్పుడు శర్వానంద్ మాత్రం వరుసగా సినిమాలను పట్టాలెక్కించాడు.
అందులో అన్నింటికంటే ముందుగా శ్రీకారం అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ల్ గ్లింప్స్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సైతం అందరినీ కట్టిపడేస్తోంది. మరీ ముఖ్యంగా టీజర్‌లోని డైలాగ్‌లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. రైతు గొప్పదనం చెప్పేలా ఉండబోతోన్న ఈ మూవీ టీజర్‌ను మహేష్ బాబు తాజాగా రిలీజ్ చేశాడు.

హీరో తన కొడుకును హీరోను చేస్తున్నాడు.. డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్‌ను చేస్తున్నాడు.. కానీ రైతు మాత్రం తన కొడుకును రైతును చేయడం లేదు.. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.. తినేవాళ్లు నెత్తి మీద జుట్టంత మంది ఉంటే.. పండించే వారు.. మూతి మీద మీసమంత మంది కూడా లేరంటూ శర్వానంద్ చెప్పిన మాటలతో టీజర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూవీ మార్చి 11న విడుదలకాబోతోంది.


Click it and Unblock the Notifications











