Major Trailer: చావుకు ఎదురుగా వెళ్లిన సైనికుడు.. దేశం గర్వించేలా అడివి శేష్ మూవీ!

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరో అడవి శేష్ ఈసారి దేశం గర్వించదగిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2008 ముంబై దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న మేజర్ సినిమాలో అడవి శేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం అతను చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబ సభ్యులతో అలాగే ఎంతోమంది ఆర్మీ వాళ్లతో కలిసి అతను ట్రావెల్ అయ్యాడు. శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. మేజర్ సినిమా మహేష్ బాబు అలాగే ఏ ప్లస్ ఎస్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. మేజర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హీరో అడివి శేష్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. దేశం కోసం వీరమరణం పొందిన ఉన్నికృష్ణన్ జీవితం మొదటి నుంచి ఈ సినిమాలో చూపించబోతున్న ట్లు తెలుస్తోంది.

Mahesh babu released Adivi sesh Major movie telugu Trailer

బార్డర్ దాటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లడం ఏమిటి అని అధికారులు అడుగుతూ ఉండగా అది కూడా మనదే కదా అని హీరో చెప్పిన డైలాగ్ తోనే ఆడియన్స్ కు ఈ సినిమా ట్రైలర్ బాగా కనెక్ట్ అయిపోయింది. మదర్ అలాగే ఫాదర్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో చాలా బలంగా చూపించారు. తల్లిదండ్రులకు కొడుకు ఆర్మీ లోకి వెళ్లడం ఏ మాత్రం ఇష్టం ఉండదు అయితే ప్రతి తల్లి కూడా ఇలానే అనుకుంటుందా అని హీరో చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తోంది.

NSG కమాండో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని ఈ సినిమాలో హైలెట్ చేసి చూపించినట్లుగా తెలుస్తుంది. అలాగే అతని ప్రేమ కథను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని కొన్ని సన్నివేశాలు క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాలో శోభితా ధూళిపాల సాయి మంజ్రేకర్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడు.

వాడికి ఒక మంచి కొడుకు గా ఉండడం కంటే.. ఒక మంచి భర్త గా ఉండడం కంటే.. ఒక సోల్జర్ గా ఉండడం అవసరం.. అని ప్రకాష్ చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. టైమ్ కి మనం లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయినా కూడా నన్ను నేను నా లైఫ్ లో సోల్జర్ అని అనుకోలేను.. అని అంటూ శేష్ చెప్పిన మరొ డైలాగ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వెనకడుగు వేసే అవకాశం ఉన్నా.. తప్పించుకునే దారి ఉన్నాకూడా దొరికితే చనిపోతాడు అని తెలుసు.. అయినా కూడా వెనుకడుగు వేయలేదు.. చావు కళ్ళల్లోకి చూసి. నువ్వు నా ప్రాణం తీసుకోవచ్చు కానీ దేశాన్ని కాదు.. అని అతను పోరాడినట్లు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చిన డైలాగ్ కూడా చాలా బావోద్వేగంగా ఉన్నాయి. ఇక జూన్ 3న రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X