ప్రభాస్ బాటలో మహేష్.. కేటీఆర్‌కు అండగా నిలుస్తున్న స్టార్ హీరోలు!
కేవలం సినిమాలే కాదు అన్ని రంగాల్లోనూ రాణిస్తాం.. మాలో సమాజ స్పృహ కూడా ఉంది అని నిరూపిస్తూ వస్తున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో టాలీవుడ్, కోలీవుడ్ నుంచి చాలా మంది హీరోహీరోయిన్లు ఉన్నారు. సామాజిక కోణంలో ఆలోచిస్తూ సమాజ హితం కోసం తమ వంతు సహకారం అందిస్తున్నారు సదరు తారలు. ఈ కోణంలోనే ఓ విషయమై ప్రభాస్, మహేష్ బాబు ఒకేరకంగా స్పందించి ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా..

మున్సిపాలిటీ సిబ్బంది పని.. ప్రజలందరూ
వైరల్ ఫీవర్, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది దోమల నివారణకు, పరిశుభత్రకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ పొలిటిషన్.. ఈ కార్యక్రమంలో అందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు.

యంగ్ పొలిటిషన్ కేటీఆర్
మీ ఇంటి పరిసరాలను పరిశీలించండి, పరిశుభ్రంగా ఉంచుకోండి. నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోండి. పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, ఇతర నీరు నిలిచే వస్తువులను తనీఖీ చేయండని కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేటీఆర్ తన సొంత ఇంటి పరిసరాలను పరిశీలించి దోమల మందు చల్లారు. ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని కోరుతూ ఆ ఫోటోలు పెట్టి ట్వీట్ చేశారు.
ప్రభాస్ బాటలో మహేష్ బాబు
మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచనలకు టాలీవుడ్ యంగ్ హీరోస్ ప్రభాస్, మహేశ్ తమ మద్దతు తెలియజేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్స్ ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసి ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. దీంతో ఇది చూసి కేటీఆర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. మరోవైపు కేటీఆర్ ట్వీట్స్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి ప్రజల్లో చైతన్యం నింపారు.

మహేష్.. సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు కెరీర్‌లో 26 వ సినిమాగా వస్తోంది సరిలేరు నీకెవ్వరు మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











