For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sridevi Soda Center మీద మహేష్ బాబు రివ్యూ.. క్లైమాక్స్ అలా, అస్సలు మిస్ అవొద్దు అంటూ!

    |

    సుధీర్ బాబు హీరోగా తెలుగు అమ్మాయి ఆనంది హీరోయిన్ గా పలాస లాంటి హిట్ సినిమా అందించిన కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్.. ముందు నుంచి కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టు ప్రభాస్, మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లాంటి హీరోల ప్రమోషన్స్ తో సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి.. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాను నిన్న మహేష్ వీక్షించారు. హోమ్ థియేటర్ లో సినిమా చూస్తున్నారు అంటూ సుధీర్ బాబు ముందు పేర్కొనగా సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు తన ట్విట్టర్ లో రివ్యూ కూడా పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

    స్టార్స్ ప్రమోషన్స్

    స్టార్స్ ప్రమోషన్స్

    శ్రీదేవి సోడా సెంటర్ అనే పేరు అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టు కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం ఆ ట్రైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చడం ఆ ట్రైలర్ లో ఉన్న యాక్షన్ డైలాగ్స్ చూసి సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. మొదటి ట్రైలర్ సుధీర్ బాబు బావ మహేష్ బాబుతో విడుదల చేయగా సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ మాత్రం విక్టరీ వెంకటేష్ విడుదల చేయించారు. ఇక ఆ తర్వాత కూడా ప్రమోషన్స్ లో మంచి జోష్ చూపిస్తూ ఏకంగా బాహుబలి స్టార్ ప్రభాస్ ను రంగంలోకి దించారు.

    అంతకంతకూ అంచనాలు పెరిగేలా

    అంతకంతకూ అంచనాలు పెరిగేలా

    ఈ సినిమా నిర్మాతలు విజయ్ జిల్లా, శశి దేవి రెడ్డిలు ప్రభాస్ కి సన్నిహితులు కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా ప్రభాస్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసి ఆయన స్వయంగా దర్శకుడిని, హీరోని కొన్ని ప్రశ్నలు అడుగుతూ వారి చేత సమాధానాలు రాబడుతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచేలాగా చేశారు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పరువు హత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఒక శాడ్ ఎండింగ్ సినిమానే అయినా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే కూడా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ అయితే మంచి జోష్ లో ఉన్నారు.

    ఏమంటాడో మరి?

    ఏమంటాడో మరి?

    అయితే ఈ సినిమా మీద ఎంతమంది ఎన్ని రివ్యూలు ఇచ్చిన తన భావ మహేష్ బాబు ఇచ్చే రివ్యూ కోసం సుధీర్ బాబు చాలా ఎదురు చూశారు. నిన్న సాయంత్రం మహేష్ బాబు తన ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్ లో ఈ సినిమా చూశారు. మహేష్ బాబు సినిమా చూస్తున్నప్పుడు వెనకనుంచి ఫోటో తీసిన సుధీర్ బాబు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మహేష్ నా సినిమా చూస్తున్నాడు ఏమంటాడో మరి? అంటూ ఆయన తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. ముందు నుంచి కూడా మహేష్ బాబు ఏ సినిమా చూసినా దానికి సంబంధించిన రివ్యూ తన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలా మహేష్ బాబు నుంచి కూడా రివ్యూ వస్తుందని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులు ఫలించాచేలాగా మహేష్ బాబు కూడా రివ్యూ ఇచ్చారు.

    మహేష్ బాబు రివ్యూ

    మహేష్ బాబు రివ్యూ

    ఇంతకీ మహేష్ రివ్యూలో ఏమన్నారంటే శ్రీదేవి సోడా సెంటర్ అనేది కష్టతరమైన క్లైమాక్స్ తో కూడిన ఒక రా అండ్ ఇంటెన్స్ ఫిలిం అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. దర్శకుడు కరణ్ కుమార్ పలాస 1978 తర్వాత మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారని, సుధీర్ బాబు నటన బ్రిలియంట్ గా ఉందని చెప్పుకొచ్చారు ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నిటి కంటే అద్భుతంగా ఉందని మహేష్ మెచ్చుకున్నారు. అలాగే తన సోదరుడు నరేష్ నటన కూడా అద్భుతంగా ఉందని ఆయన నటనా కెరీర్లో ఇదొక అద్భుతమైన పాత్రగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చారు. ఇక ఆనంది గురించి కూడా స్పెషల్ గా చెబుతూ ఆమె శ్రీదేవి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఇక సినిమాకు సంబంధించిన అద్భుతమైన విజువల్స్, అవుట్ స్టాండింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అస్సలు మిస్ అవ్వకూడదు అని సినిమా యూనిట్ మొత్తానికి మరోసారి కంగ్రాచ్యులేషన్స్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

    Real Secret Behind Sudheer Babu Six Pack
    పేరు పేరునా ధన్యవాదాలు

    పేరు పేరునా ధన్యవాదాలు

    ఇక మహేష్ బాబు ఇచ్చిన రివ్యూతో యూనిట్ అయితే పండగ చేసుకుంటుంది. దర్శకుడు కరణ్ కుమార్ అయితే ఇది నా సూపర్ స్టార్ మూమెంట్ 'మహేష్' గారు చాలా థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక సుధీర్ బాబు అయితే నిన్న ఉదయం నుంచి కూడా సినిమా ధియేటర్లలో పర్యటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటిదాకా సుధీర్ బాబు మహేష్ రివ్యూ మీద ఎలాంటి కామెంట్ చెయ్యక పోయినప్పటికీ తన సినిమా గురించి ప్రస్తావించిన మిగతా హీరోలు అందరినీ ఆయన పేరుపేరునా విష్ చేశారు. సుధీర్ బాబు సినిమా బాగుందని చెబుతూ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, హీరో రాజ్ తరుణ్, నవదీప్, రాణా దగ్గుబాటి, నాగ శౌర్య వీళ్లంతా కూడా సినిమా కోసం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇక ఈ ఊపు చూస్తుంటే సుధీర్ బాబు కెరీర్లోనే ఈ సినిమా మంచి కలెక్షన్లతో టాప్ లో నిలబడే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

    English summary
    Super star Mahesh Babu watched Sudheer Babu's Sridevi Soda Center movie and gave Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X