SSMB29: మహేశ్ బాబు పాత్ర లీక్.. హనుమంతుడి తరహాలో.. ఆ అడవుల్లో మేజర్ షూటింగ్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ స్థాయిలో RRR మూవీ సక్సెస్, ఆస్కార్ అవార్డు గెలవడంతో తర్వాతి సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జక్కన్న. అందుకోసమే స్క్రిప్ట్ నుంచి విజువల్స్ వరకు చాలా గ్రాండ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి పని చేయడం స్టార్ట్ చేసిన రాజమౌళి SSMB29లో మహేశ్ బాబు పాత్రను ఇతిహాసాలతో ముడిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ఓ క్రేజీ అప్డేట్ ఆసక్తి కలిగించేలా ఉంది.

Rajamouli Mahesh Babu Movie

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెలుగు దర్శ దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న SSMB29 సినిమా కోసం జక్కన్న పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఇంతకు ముందు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేశ్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించిన విషయం తెలిసిందే.

డిస్నీ సంస్థతో: రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగానే ఇండియానా జోన్స్ వంటి యాక్షన్ అండ్వెంచరస్ సినిమాగా ఉండనుందని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చి ఆసక్తి కలిగించారు. హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం లాస్ ఏంజిల్స్ లోనే ఇంటర్నేషనల్ స్టూడియోతో కలిసి పని చేయనున్నారని టాక్. ఈ బాధ్యతలను డిస్నీ సంస్థ తీసుకోనుందని గతంలో తెలిపారు.

Mahesh Babu As Lord Hanuman

రెండేళ్లకు: అయితే తాజాగా అప్డేట్ ప్రకారం మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ SSMB29 భారీ ప్రాజెక్ట్ ను పొందే రేసులో ఉందని సమాచారం అందుతోంది. మరోవైపు సోనీ పిక్చర్స్ (Sony Pictures) కూడా ఇందుకోసం చర్చలు జరుపుతోందట. ఇక ఈ రెండింటిలో ఎవరికీ అవకాశం దక్కుతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీని 2025 చివరి నాటికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మూడు పార్టులుగా: గ్లోబల్ రేంజ్ లో SSMB29ను తెరకెక్కించేందుకు మూవీ కథను రెండు భాగాలుగా లేదా సీక్వెల్ గా చేయనున్నట్లు జక్కన్న ఆలోచిస్తున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్స్ ఉంటాయని, వీటిల్లో కథ మారుతుందని, ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా కథనాలు కూడా వచ్చాయి. అయితే దీన్ని మూడు పార్టులుగా తెరకెక్కించనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది.

Mahesh Babu As Lord Hanuman

హనుమంతునికి: ఇదిలా ఉంటే SSMB29లో మహేశ్ బాబు పాత్ర గురించి తాజాగా ఓ సమాచారం ఆసక్తి రేపుతోంది. మహేశ్ పాత్రను హనుమంతుని నుంచి ప్రేరణ పొందినట్లుగా తెలుస్తోంది. అయితే రామాయణం, మహాభారతాలను స్ఫూర్తిగా తీసుకుంటారని తెలిసిందే. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంటర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ క్యారెక్టర్ కి హనుమంతునికి సమానమైన లక్షణాలు ఉంటాయని బాలీవుడ్, నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అమెజాన్ ఫారెస్ట్: SSMB29 చిత్రంలో మహేశ్ బాబు అడవిలో అన్ని అసమానతలతో పోరాడిన చరిత్రను కలిగి ఉంటాడని తెలుస్తోంది. ఇక అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాను అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువ శాతం చిత్రీకరిస్తారని బాలీవుడ్, నేషనల్ మీడియా పేర్కొంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి తీసుకెళ్లేలేలా రాజమౌళి టీమ్ పని చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X