మళ్లీ పప్పులో కాలేసిన మహేష్ బాబు.. రెండోసారి కూడా క్రేజీగా ఆయనే!
సూపర్‌స్టార్ మహేష్ బాబు బ్రాండ్ వ్యాల్యూ ఖాతాలో మరోసారి సంతూర్ చేరిపోయింది. టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న మహేష్‌ను సంతూర్ రెండోసారి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకొన్నది. దాంతో మరోసారి బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్, కన్జూమర్ కేర్ బిజినెస్ అధ్యక్షుడు శ్రీ అనిల్ చౌ మాట్లాడారు.

మహిళల గౌరవాన్ని
సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. సంతూర్ అనేది మహిళలకు చాలా ఇష్టమైన సోప్. అంతేకాకుండా వారి గౌరవాన్ని పెంచేలా ఉంటుంది. గత ఆరేళ్లుగా నేను ఈ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. దేశవ్యాప్తంగా అత్యున్నత బ్రాండ్‌గా ఓ రికార్డు ఉంది. ఈ బ్రాండ్‌తో అసోసియేట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

30 సెకన్లలో యాడ్‌లో
అనిల్ మాట్లాడుతూ.. వయసు విషయంలో పొరబడటం అనే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని కేవలం 30 సెకన్లలో యాడ్‌ను రూపొందించాం అని అన్నారు. సంతూరు యాడ్ రూపొందించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటాం. మా సబ్బు ద్వారా మీరు యవ్వనంగా కనిపించే లుక్ వస్తుందని చెప్పడమే యాడ్ ఉద్దేశం. అందుకోసం అవసరమైన సెలబ్రిటీల ద్వారా సందేశానని అందరికీ చేరవేస్తాం. ఈ సారి కూడా సంతూర్ కోసం తెలుగు నుంచి మహేష్ బాబు, తమిళం నుంచి కార్తీ, హిందీ నుంచి వరుణ్ ధావన్‌ను ఎంపిక చేసుకొన్నాం అని అనిల్ అన్నారు.

మహేష్, కార్తీ, వరుణ్ ధావన్
దేశ సినీ పరిశ్రమలో ఈ ముగ్గురు స్టార్లు మా బ్రాండ్‌ను ప్రమోట్ చేయనున్నారు. సంతూర్ మహిళల సరికొత్త స్టోరిని ఇక నుంచి ఈ ముగ్గురు హీరోలు చెప్పబోతున్నారు. వయసును పొరబాటు పడే సంతూర్ సిగ్నేచర్ క్యాంపెయిన్ అందరిని ఆకట్టుకొంటుందని భావిస్తున్నాం అని అనిల్ పేర్కొన్నారు. 1986లో సహజసిద్ధమైన చందనం, పసుపును ఉపయోగించి సంతూరు సబ్బును ఉయోగించామని తెలిపారు.
క్రికెట్ నేపథ్యంగా యాడ్
సంతూర్ కోసం కొత్తగా రూపొందించిన యాడ్ క్రికెట్ నేపథ్యంగా రూపొందింది. స్టేడియంలో క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు ఉంటారు. ఈ క్రమంలో క్రికెటర్ కొట్టిన బంతి స్టాండ్ వైపు వస్తుంది. దానిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది మిస్ కావడంతో మరో అమ్మాయి క్యాచ్ పడుతుంది. అప్పుడే మహేష్ అసిస్టెంట్ చూసి తమ సినిమాలో హీరోయిన్ పాత్రకు సరిపోతుందనుకొంటారు. అంతలోనే ఓ పాప మమ్మీ అంటూ పరుగుత్తుకొంటూ వస్తుంది. అందమైన అమ్మాయికి పెళ్లై, కూతురుగా ఉందా అని కన్‌ఫ్యూజ్ అవుతారు.


Click it and Unblock the Notifications











