Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ 26 లో మహేష్ క్యారెక్టర్ ఇదే.. రివీల్ చేసిన డైరెక్టర్
మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా 'మహర్షి' తర్వాత ఆయన కెరీర్లో 26 వ సినిమాగా రాబోతోంది సరిలేరు నీకెవ్వరు మూవీ. ఇటీవలే ఎఫ్ 2 ను రూపొందించి ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిపిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ తనదే కావాలనే సంకల్పంతో ఈ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నామని టైటిల్ పోస్టర్ ద్వారానే ప్రకటించేశారు అనిల్ రావిపూడి.
నేడు (మే 31) సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యామిలీతో విదేశాల్లో ఉండటం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎంతో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్రయూనిట్ అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. మంచి హిట్ అందించి ఆయన రుణం తప్పకుండా తీర్చుకుంటా. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్‌బాబు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత సీనియర్ నటి విజయశాంతి మా సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇస్తుండటం సంతోషంగా ఉంది. చిత్రంలో జగపతి బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని అనిల్ రావిపూడి అన్నారు.
అంటే మాహేష్ పాత్రకు తగ్గట్లే టైటిల్ లుక్ డిజైన్ చేశారన్నమాట. సరిలేరు నీకెవ్వరు లుక్ గమనిస్తే.. టైటిల్ పక్కనే తుపాకీ, దానిపై ఓ క్యాప్ పెట్టి ఉంచారు. దీనిని బట్టి ఆర్మీ ఆఫీసర్‌గా ఇందులో మహేష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిర్మాణంలో దిల్‌రాజు, రామబ్రహ్మం సుంకరలతో పాటు మహేష్‌బాబు కూడా భాగం కానుండటం విశేషం.