Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'సైరా' ట్రైలర్‌పై మహేష్ బాబు కామెంట్స్.. రామ్ చరణ్ రియాక్షన్ ఎలా ఉందంటే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విడుదల కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఇటీవలే విడుదలైన 'సైరా' ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా..
'సైరా నరసింహా రెడ్డి'.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
చిరంజీవి హీరోగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రాబోతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ తాజాగా విడుదలైన ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.
సరికొత్త రికార్డుల దిశగా సైరా ట్రైలర్
రోమాలు నిక్కబొడిచేలా ఉన్న 'సైరా నరసింహా రెడ్డి' ట్రైలర్ సోషల్ మీడియా, యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హంగామా చేస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే 20 లక్షల వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్.. ఇప్పటివరకు 85 లక్షల వ్యూస్ దాటేసి పరుగులు పెడుతోంది. సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది.
|
మహేష్ బాబు కామెంట్.. వైరల్
అయితే తాజాగా ఈ ట్రైలర్ పై, సైరా నరసింహా రెడ్డి సినిమాపై తనదైన శైలిలో స్పందించారు మహేష్ బాబు. ''సైరా ట్రైలర్లో అసాధారణమైన విజువల్స్ ఉన్నాయి. ట్రైలర్ లోని ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్, అమితాబ్, సురేందర్ రెడ్డి అందరు గ్రేట్ వర్క్ చేశారు. సైరా కోసం ఎదురు చూస్తున్నాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
రామ్ చరణ్ రెస్పాన్స్
మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ పై వెంటనే రామ్ చరణ్ స్పందించారు. మహేష్ బాబుకు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా మెస్సేజ్ పెట్టారు. దీంతో ఇటు మహేష్ బాబు అభిమానులు, అటు మెగా అభిమానులు ఈ ట్వీట్స్ చూసి మురిసిపోతున్నారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ
తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ర్యాంక్‌లో ఉండటం విశేషం. కేవలం ఫ్యాన్స్‌నే కాకుండా సగటు ప్రేక్షకుడి చేత కూడా జై కొట్టించుకుంటోంది సైరా ట్రైలర్. దీంతో సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.
వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
మరోవైపు 'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు.
సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.