సినిమాలే కాదు.. సామాజిక సేవలోను మహేష్‌ బాబుకి సరిలేరు ఇంకెవ్వరూ!

సామాజిక కార్యక్రమాల్లో సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున భాగమవుతున్నారు. వారి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తమ వంతుగా సామాజిక బాధ్యతలను భుజాలపై వేసుకుంటున్నారు. నిజంగా ఇది అభినందించదగిన విషయం. ఈ కోణంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, తన మనసు గొప్పదని నిరూపించుకున్నారు.

భార్య నమ్రత సహకారంతో సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు మహేష్ బాబు. తాను సంపాదిస్తోన్న దానిలో కొంత మొత్తం సామాజిక సేవకు కేటాయిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందరో అనాథ పిల్లలకు సాయం అందిస్తున్న ఆయన హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు.

Mahesh Babus Greatness in Social work

యూకేకు చెందిన హెడ్‌లైన్ లిటిల్ హార్ట్స్ (HLH), విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్‌తో కలిసి ఈ బృహత్తర సేవా కార్యక్రమం చేస్తున్నారు మహేష్. ఈ సేవలో భాగంగా ఇప్పటికే మొత్తం 1000 మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు. ఈ ఆపరేషన్లకు అయిన ఖర్చు మొత్తాన్ని మహేష్ బాబు భరిస్తూ సరిలేరు తనకెవ్వరు అనిపించుకుంటున్నాడు మహేష్.

తమ అభిమాన హీరో మహేష్ బాబు, వెయ్యి మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మనసున్న మారాజు మా మహేష్ బాబు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X