మహేష్ ఫంక్షన్‌లో నాచురల్ స్టార్ నాని మెరుపులు.. ప్రేక్షకుల్లో ఆతృత

ఈ రోజుల్లో ఓ సినిమా అర్దశతదినోత్సవ వేడుక జరుపుకోవడమంటే చాలా గ్రేట్. విడుదల కాగానే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి నేటి సినిమాలు. అయితే మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి మాత్రం అందులోంచి మినహాయించ బడింది. 200 థియేటర్స్ లో విజయవంతగా 50 రోజుల పాటు ఆడి రికార్డు లెవెల్‌లో కలెక్షన్స్ రాబట్టడంతో ఎంతో అట్టహాసంగా మహర్షి 50 రోజుల ఫంక్షన్ నిర్వహించాలని ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు.

ఈ మేరకు జూన్ 28 వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో భారీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ వేడుకపై మెరవబోయే ముఖ్యఅతిథి ఎవరై ఉంటారా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ ఫంక్షన్‌కి నాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని తెలిసింది. నానితో నిర్మాత దిల్ రాజు సంప్రదింపులు చేయగా నాని వెంటనే ఓకే చెప్పేశారని అంటున్నారు. దీంతో నాచురల్ గానే ఎంతో అట్రాక్ట్ చేస్తూ మాట్లాడే నాని మాటల్లో మహర్షి సినిమా విశేషాలు, మహేష్ బాబు గురించి నాని చెప్పబోయే సంగతులు వినాలని ప్రేక్షకుల్లో ఆత్రుత మొదలైంది.

 Mahesh Babus Maharshi 50 Days Function Chief Guest Nani..!

డైరెక్టర్ వంశీ పైడిపెల్లి తెరకెక్కించిన 'మహర్షి' మూవీ నిర్మాతలకు లాభాల పంట పండించింది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటన, మహేష్ ఫ్రెండ్ గా అల్లరి నరేష్ అభినయం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. రైతు నేపథ్యంలో షూట్ చేసిన సన్నివేశాలు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ సినిమా పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వేసిన మహేష్.. ఇటీవలే ఇండియా తిరిగొచ్చారు. మరికొద్ది రోజుల్లోనే తన తర్వాతి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్ పైకి రానున్నారు మహేష్ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X