twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహర్షి మరో రికార్డు... 200 సెంటర్స్‌లో 50 రోజులు.. 200 కోట్లకు చేరువలో!

    |

    టాలీవుడ్‌లో అర్ధ శతదినోత్సవం అనే మాట వినపడి చాలా రోజు అవుతున్నది. వారంలో కలెక్షన్లను కుమ్మేసామా? సినిమాను గాలికి వదిలేసామా? అనే పద్దతిలో సినిమాల ప్రదర్శన జరుగుతున్నది. తెలుగు పరిశ్రమలో కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి మహర్షి బ్రేక్ ఇచ్చింది. ఈ ఘన విజయం వెనుక సూపర్ స్టార్ మహేష్ కృషి ఎంతైనా ఉందనే మాట వినిపిస్తున్నది. ఈ సినిమా 50 రోజులు ప్రదర్శించడం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఇవే..

     మహేష్ చొరవతో సక్సెస్ ట్రాక్‌పైకి

    మహేష్ చొరవతో సక్సెస్ ట్రాక్‌పైకి

    సినీ విమర్శకుల మిక్స్‌డ్ రివ్యూ, కొన్ని వర్గాల ప్రతికూల టాక్‌ను సొంతం చేసుకొన్నప్పటికీ.. మహేష్ బాబు చేసిన ప్రమోషన్ సినిమాకు కలిసి వచ్చింది. సినిమాను సక్సెస్ ట్రాక్‌పై పరుగులు పెట్టించిన ఘనత ఎంటైర్ టీమ్‌కు చెందుతుందని చెప్పవచ్చు. దాంతో సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన మహర్షి ఎపిక్‌ బ్లాక్‌గా మారింది.

     200 సెంటర్లలో 50 రోజుల పండుగ

    200 సెంటర్లలో 50 రోజుల పండుగ

    బాహుబలి తర్వాత వేళ్ల మీద లెక్కపెట్టే విధంగా 50 రోజులు పండుగను జరుపుకొన్నాయి. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. సుమారు రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. సూపర్ కలెక్షన్స్‌తో 'మహర్షి' 200 సెంటర్స్‌లో జూన్ 27 న 50 రోజులు పూర్తి చేసుకోనుంది.

     మహేష్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా

    మహేష్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా

    సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్రెమండస్‌ పెర్‌ఫార్మెన్స్‌, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్‌ టేకింగ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సినిమా రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్‌ మహేష్‌ గత కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేసి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది.

    జూన్ 28న శిల్పకళా తోరణంలో

    జూన్ 28న శిల్పకళా తోరణంలో

    మహర్షి సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా చిత్ర బృందం జూన్ 28 న సాయంత్రం 6 గంటల నుంచి 'మహర్షి' 50 రోజుల వేడుకని హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో ఘనంగా జరుపనున్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, అల్లరి నరేష్, ముఖేష్ రుషి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించిన సంగతి తెలిసిందే

    English summary
    Superstar Mahesh, Superhit Films Director Vamshi Paidipally's Epic Blockbuster 'Maharshi' combinely produced by Vyjayanthi Movies, Sri Venkateswara Creations, PVP Cinema became a huge blockbuster and created history all over the world. 'Maharshi' is Completing 50 days with superb collections in 200 centers on June 27th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X