మహర్షి మూవీ ఫస్టాఫ్ హైలెట్స్.. ఎమోషనల్‌గా మహేష్ కాలేజీ స్టూడెంట్ ఎపిసోడ్స్

'శ్రీమంతుడు', 'భరత్‌ అనే నేను'లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌, పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయింది. మహర్షి చిత్రంలో హైలెట్ పాయింట్స్ ఇవే...

బిజినెస్‌మెన్‌గా మహేష్ ఎంట్రీ

బిజినెస్‌మెన్‌గా మహేష్ ఎంట్రీ

మహర్షి ఫస్టాఫ్ విషయానికి వస్తే కథ అమెరికాలో ప్రారంభమవుతుంది. మహేష్ బాబు స్టయిలీష్ బిజినెస్‌మెన్‌గా ఎంట్రీ అదిరిపోయింది. మహేష్ ఎంట్రీ తర్వాత వేదికతోపాటు థియేటర్లో ప్రేక్షకుల గోల రెట్టింపుగా కనిపించింది. నువ్వే సమస్తం అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మహేష్ స్క్రీన్ ప్రజెన్స్‌కు తోడైంది.

ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌తో

ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌తో

మహర్షి సినిమా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌తో పాజిటివ్‌గా వెళ్తుంది. యాంకర్ ఝాన్సీ ఇంటర్వ్యూ సినిమాను మరో మలుపు తిప్పేలా ఉంది. మహేష్ బాబు బాల్యం ఎపిసోడ్ మొదలైంది. బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉంది.

రిషి కాలేజ్ సన్నివేశాల జర్నీ

రిషి కాలేజ్ సన్నివేశాల జర్నీ

మహేష్ బాల్యం ఫ్లాష్ బ్యాక్ నుంచి కథ ప్రజెంట్ రావడం.. ఆ తర్వాత రిషి కాలేజ్ ఫ్రెండ్స్ కలుసుకోవడంతో కథ ఆసక్తిగా మారింది. దాంతో మళ్లీ కథ కాలేజీ ఫ్యాష్ బ్యాక్‌కు వెళ్లడం మహేష్ బాబు యంగ్ స్టూడెంట్‌గా క్రేజీగా కనిపించాడు. మహేష్ గెడ్డం, మీసాల లుక్ కొత్తగా ఆకట్టుకునేలా ఉంది. ఫ్యాష్ బ్యాక్‌లో మహేష్ బాబు తల్లిదండ్రులుగా ప్రకాశ్ రాజ్, జయసుధ ఇంట్రడక్షన్ బాగుంది. వారి మధ్య ఎమోషన్స్ సీన్లు సినిమా భావోద్వేగంగా మలిచాయి.

అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ సీన్స్

అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ సీన్స్

కాలేజ్‌లో సక్సెస్ ఈజ్ జర్నీ అంటూ రిషి ప్రసంగం ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేలా దర్శకుడు చిత్రీకరించాడు. పేద విద్యార్థిగా అల్లరి నరేష్, ఆయన తండ్రిగా తనికెళ్ల భరణి ఎంట్రీ మరో ఎమోషనల్ ఫ్యాక్టర్‌గా కనిపించింది.

పూజా హెగ్డే, ముఖేష్ రుషి ఫైట్స్‌తో

పూజా హెగ్డే, ముఖేష్ రుషి ఫైట్స్‌తో

హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్రడక్షన్.. చోటీ చోటీ సీ బాతే పాట.. ముఖేష్ రిషి‌తో ఫైట్ సీన్ కమర్షియల్‌గా సాగిపోయింది. మహేష్ కాలేజీ స్టూడెంట్ గెటప్ మరీ క్రేజీగా ఉంది. పూజా తల్లిదండ్రులను కలుసుకోవడం.. ఎవరెస్ట్ అంచున పాట మొదలవుతుంది.ప్లాష్ బ్యాక్‌లో మహేష్ బాబు రిషిగా కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తవుతుంది. కథలో గొప్ప ట్విస్ట్ బయటపడుతుంది.

ఇండియాకు మహేష్ రాకతో ఇంటర్వెల్

ఇండియాకు మహేష్ రాకతో ఇంటర్వెల్

అల్లరి నరేష్ పాత్ర వెనుక ఓ కీలక అంశం బయటకు రావడం.. ఆ సీన్‌కు నువ్వని అనే పాట జోడవ్వడం సినిమాను మరో మెట్టు ఎక్కించేలా ఉంది. అల్లరి నరేష్ ట్విస్ట్ తర్వాత మహేష్ అమెరికాను వదిలి ఇండియాలో అడుగుపెట్టడంతో ఇంటర్వెల్ బ్యాంగ్.. సినిమా తొలిభాగంలో ఇవీ కీలకమైన అంశాలుగా కనిపిస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X