మహర్షి 100 డేస్.. మహేష్ అభిమానులకు దిల్ రాజు కానుక!
సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం మహర్షి. తన కెరీర్‌లో 25వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు మంచి రూపొందించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధించింది. అయితే ఈ చిత్రం ఆగస్టు 16వ తేదీకి 100 రోజులు పూర్తి చేసుకొన్నది. ఇటీవల కాలంలో శతదినోత్సవం పోస్టర్ పడిన సినిమాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహర్షి సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది.
మహర్షి సినిమా 100 రోజులు పూర్తి చేసుకొన్న తరుణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. మహర్షి చిత్రం ఈ రోజుకు వంద రోజులు పూర్తి చేసుకొన్నది. అభిమానం, ప్రేమ కురిపించిన మీకోసం ఈ సినిమా నుంచి తొలగించిన సీన్‌ను కానుకగా ఇస్తున్నాం అని ట్వీట్‌లో పేర్కొన్నది.

మహర్షి డిలీటెడ్ సీన్‌లో మహేష్ కేక పెట్టించారు. కమల్ కామరాజు, మహేష్ మధ్య ఫైట్ సీన్ ఆకట్టుకునేలా ఉంది. కాలేజీలో మహేష్, పూజా హెగ్డేను ర్యాంగింగ్ చేసే క్రమంలో ఈ సీన్ వచ్చే అవకాశం ఉండేది. నిడివి కారణంగా తొలగించి ఉంటారు. మహేష్, కమల్‌కు ప్రిన్స్‌పాల్ అనీష్ కురువిల్లా క్లాస్ పీకడం ఎమోషనల్‌గా ఉంది. ఆ డిలీటెడ్ సీన్ మీరు చూడండి..


Click it and Unblock the Notifications











