మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మే 9న మహర్షి చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.
దీంతో చిత్ర యూనిట్ త్వరలో హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. మహేష్ 25 వ చిత్రం కావడంతో అభిమానులని మెప్పించేలా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తో పని చేసిన దర్శకులందరి వీడియోల్ని ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రదర్శించబోతున్నారు.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ ని మే 1న హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీని, వేదికని ఈ వారమే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్, వంశీపైడిపల్లి తొలి కాంబినేషన్ లో వస్తున్న మహర్షిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











