మహర్షి సెన్సేషన్.. రికార్డు ధరకు శాటిలైట్ హక్కులు.. ఎవరికి దక్కాయంటే...

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, సూపర్‌స్టార్ మహేష్ కాంబినేషన్‌లో మహర్షి చిత్రం క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రంలో మహేష్ ఐఐటీ విద్యార్థిగా నటిస్తున్నారనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బిజినెస్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

రికార్డు రేటుకు మహర్షి

రికార్డు రేటుకు మహర్షి

మహర్షి చిత్రాన్ని ఓ వైపు తెరకెక్కిస్తున్నే మరో వైపు బిజినెస్ వ్యవహారాలను దిల్ రాజు చక్కబెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను భారీ రేటుకు అమ్మినట్టు తెలిసింది. తాజా బిజినెస్ వార్త సినీ, ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రూ.20 కోట్లకుపైగా

భరత్ అనే నేను సినిమా హిట్ తర్వాత మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సుమారు రూ.20 కోట్లకుపైగా చెల్లించి జెమిని టెలివిజన్ (సన్ నెట్ వర్క్) హక్కులను దక్కించుకొన్నట్టు సమాచారం. అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

అమెరికాలో షెడ్యూల్

అమెరికాలో షెడ్యూల్


మహర్షి సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించారు. అంతకు ముందు డెహ్రాడూన్, హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recommended Video

Huge Amount For Super Star Mahesh Maharshi Hindi Satellite Rights
మహేష్‌బాబుతో పూజాహెగ్డే

మహేష్‌బాబుతో పూజాహెగ్డే

అందాల భామ పూజా హెగ్డే ఈ చిత్రం కోసం మహేష్‌తో జతకట్టింది. షారుక్ ఖాన్ నటించిన రాయిస్, డాన్ చిత్రాలకు పనిచేసిన కేయూ మోహనన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X