ఉగాది పండుగ రోజున.. ఫ్యాన్స్‌కు మహేష్ బాబు శుభవార్త
భారత్ అనే నేను బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం మహర్షి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే టీజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఆ రోజు రానే వచ్చేసింది.
మహర్షి టీజర్‌ను ఏప్రిల్ 6వ తేదీన ఉగాది పండుగ రోజున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ ప్లాన్ చేశారు. టీజర్ రిలీజ్ గురించి దర్శకుడు వంశీ పైడిపళ్లి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఉగాది పండుగ రోజున ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహర్షి టీజర్ బయటకు వస్తున్నది. మీరంత రిషిని కలుసుకోవచ్చు. రిషిగా సూపర్‌స్టార్ జర్నీలో మీరు భాగం కావాలి అని వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు.
మహర్షి చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా మీనాక్షి దీక్షిత్, అల్లరి నరేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇంకా ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సాయి కుమార్, జయసుధ నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











